Abn logo
Sep 30 2020 @ 00:43AM

భూ పోరాటం

Kaakateeya

దళితుల భూమిని కబ్జా చేసిన భూస్వాములు  కోట్లు పలుకుతుండటంతో కన్నేసిన వాసరులు

తమ పేర రిజిస్ర్టేషన్‌ చేయించుకున్న ఘనులు  ఇతరులకు విక్రయించిన ప్రబుద్ధులు

లిటిగేషన్‌లతో తప్పుదారి పట్టించిన కొందరు రెవెన్యూ అధికారులు

దళితులకు న్యాయం చేయాలని కోర్టులు, ఉన్నతాధికారుల ఆదేశాలు

15 ఏళ్లుగా పోరాటం చేస్తున్న నేటికీ దక్కని న్యాయం


మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : కౌలుదారీ చట్టం ప్రకారం తమ కుటుంబా లకు దక్కాల్సిన దాదాపు రూ.వంద కోట్ల విలువైన భూ మి కోసం ఆ దళితులు 15 ఏళ్లుగా పోరాటం చేస్తు న్నారు. కోర్టులు, ఉన్నతాధికారుల నుంచి వీరికి అను కూలంగా తీర్పులు, ఆదేశాలొస్తున్నా, భూస్వాముల వా రసుల ఒత్తిళ్లతో వీరికి సంక్రమించాల్సిన భూమి దక్క డం లేదు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం బాదేపల్లి రెవెన్యూ శివారులోని సర్వే నంబర్‌ 64, 65లలోని భూముల్లో దశాబ్దాలుగా దళితులకు జరిగిన అన్యాయం, తాజాగా ఆ కుటుంబీకుల వారసులు వి రాసత్‌ కోసం దరఖాస్తు చేసుకోవడంతో వెలుగులోకి వచ్చింది.


బాదేపల్లిలోని సర్వే నంబర్‌ 64లో 9.17 ఎకరాలు, 65లో 6.35 ఎకరాలు కలిపి మొత్తం 16.12 ఎకరాలు కౌలుదారీ చట్టం ప్రకారం పెద్దబాలయ్య తదితరులకు 1980లో 38-ఈ సర్టిఫికెట్‌ జారీ అయింది. దీని ప్రకారం పెద్దబాలయ్య తదితరులకు భూ యాజమాన్య హక్కు లు వర్తింపజేస్తూ, అదే ఏడాది టైటిల్‌ డీడ్‌, పట్టాదారు పాసుపుస్తకం అందజేశారు. అయితే వీరు నిరక్షరాస్యు లు కావడం, ఏళ్ల తరబడి భూస్వాముల వద్దే పని చేస్తుండటంతో వీరికి ఇచ్చినట్లే ఇచ్చిన భూమిని భూ స్వాములే అమ్ముకున్నారు. పెద్దబాలయ్య కుటుంబీకు లు, వారసుల అనుమతి, సంతకాలు లేకుండానే భూ విక్రయాలు జరిపారు. టైటిల్‌ డీడ్‌, పాసు పుస్తకాలు న్నా, అవి అందుబాటులో లేవని రిజిస్ట్రేషన్‌ దస్తావేజు ల్లో పేర్కొన్నారు. 


బాలయ్య కుమారుడు శ్యాంసుందర్‌ తదితరులు ఈ విషయాన్ని గ్రహించి, తమ పెద్దలకు కౌలుదారీ చట్టం ద్వారా వర్తించిన భూమిని తమకు విరాసత్‌ చేయాలం టూ పదిహేనేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. తహసీల్దార్‌ మొదలుకొని కలెక్టర్‌ వరకు, మున్సిఫ్‌ కోర్టు మొదలుకొని హైకోర్టు వరకు, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సైతం దళిత కుటుంబానికి భూమి హక్కులు కల్పిం చాలని ఆదేశించారు. కానీ, స్థానిక రెవన్యూ యం త్రాంగం మాత్రం ఏదో ఒక లిటిగేషన్‌ పెడుతూ, ఈ భూమిపై దళిత కుటుంబానికి హక్కులు కల్పించడం లేదు.


తమ కుటుంబానికి సర్వే నంబర్‌ 64లో ఉన్న 9.17 ఎకరాల భూమిని తాము విక్ర యించలేదని పలు ఆధారాలతో శ్యాంసుం దర్‌ కోర్టులను, రెవెన్యూ కోర్టులను, ఎస్సీ, ఎ స్టీ కమిషన్‌ను ఆశ్రయించాడు. దీంతో సమ స్యను పరిష్కరించక తప్పని పరిస్థితి ఎదు రైంది. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు నివేదిక సమ ర్పించే నిమిత్తం అప్పటి తహసీల్దార్‌ భూ స్వామ్య కుటుంబీకుల ప్రమేయంతో 2015లో సర్వే నంబర్‌ 64/1, సర్వే నంబర్‌ 64/3 రెండూ ఒకటేనని స్టేట్మెంట్‌ ఇచ్చారు. ఈ భూమిని 1983లోనే శ్యాంసుందర్‌ తం డ్రి బాలయ్య తదితరులు విక్రయించారని పేర్కొన్నారు. అయితే, శ్యాంసుందర్‌ మా త్రం వాస్తవంగా తమ పెద్దలు ఈ భూ మిని 1983లోనే విక్రయిస్తే ఆ తర్వాత వ చ్చిన రెవన్యూ రికార్డుల్లో, పహాణీల్లో, ఆర్‌వో ఆర్‌లలో ఎందుకు రికార్డులు మార్చలేదని, 38-ఈ సర్టిఫికెట్‌ని ఎందుకు రద్దు చేయ లేదని ప్రశ్నిస్తున్నారు.


ఈ సర్వే నంబర్‌లో కౌలుదారీ చట్టం ప్రకారం తమ పెద్దలకు కేటాయించిన భూ మి మినహా మిగిలిన భూస్వాముల భూమి ని అమ్ముకున్న భూస్వాముల వారసులు, రి కార్డుల్లో మాత్రం తమ తండ్రుల పేర ఉన్న భూమిని అమ్మినట్లు సృష్టించారని ఆరోపి స్తున్నారు. సర్వే నంబర్‌ 65లోనూ తమకు గజం భూమి దక్కలేదని, ఇక్కడ తమ కు టుంబానికి కేటాయించిన భూమికి భూ స్వాములకు అనుకూలమైన వారికి జీపీఏ ఇప్పించుకొని అమ్ముకున్నారని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు.


భూస్వాములే అమ్ముకున్నారు

కౌలుదారి చట్టం ప్రకారం మా కుటుంబానికి దక్కాల్సిన 16.12 ఎక రాల భూమిని భూస్వాముల వారసులే అమ్ముకున్నారు. మా నాయన లకు చదువు రాకపోవడం, మేం వేరే పనుల్లో ఉండడంతో ఈ మోసం జరిగింది. విషయాన్ని ఆలస్యంగా గమనించిన పదిహేనేళ్లుగా మా భూమి కోసం పోరాడుతున్నాం. న్యాయం జరగలేదు. ఇప్పటికైనా మా భూమిపై మాకు విరాసత్‌ కల్పించాలని కోరుతున్నాం.

- శ్యాంసుందర్‌, కౌలుదారు పెద్దబాలయ్య వారసుడు


విచారణ నిర్వహించాలి

బాదేపల్లిలో దళితులకు చెందిన భూమిని భూస్వాములు కబ్జా చేసి అమ్ముకున్న సంఘటనపై ప్రభుత్వం తక్షణం విచారణ నిర్వహించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పరమేశ్వర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం ప్రచురితమైన ‘దళితుల భూమిపై దౌర్జన్యం’ కథనానికి ఆయన స్పందించారు. దళితులు, అణగారిన వర్గాల భూములను రక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తక్షణం ప్రభుత్వం స్పందించి నిజమైన అర్హుదారులైన దళిత బాలయ్య వారసులకు భూమిని అప్పగించాలని డిమాండ్‌ చేశారు. దళితుల భూముల సంరక్షణకు సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని, బాధితులకు న్యాయం జరిగేంతవరకు అండగా ఉంటామని ఆయన హెచ్చరించారు.


Advertisement
Advertisement
Advertisement