Advertisement
Advertisement
Abn logo
Advertisement

భూ వివాదాలకు చెక్‌ పెట్టేందుకు రీసర్వే

  • సబ్‌కలెక్టర్‌ ఇలాక్కియా

దివాన్‌చెరువు, అక్టోబరు 14: భూ వివాదాలకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభు త్వం సర్వే ఆఫ్‌ ఇండియా సహకారంతో అత్యాధునిక సాంకేతికతను జోడించి భూముల రీసర్వే చేపట్టిందని రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ ఇలాక్కియా అన్నారు. రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం, నామవరం గ్రామాల్లో చేపట్టిన వైఎస్‌ఆర్‌ జగనన్న భూ శాశ్వత హక్కు, భూరక్ష సమగ్ర భూ రీసర్వే ప్రక్రి యను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వే పూర్తయిన అనంతరం భూములన్నింటికీ స్పష్టమైన టైటిల్స్‌ వస్తాయని తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో జీపీఎస్‌ కోఆర్డినేట్స్‌, రోవర్స్‌ ఫ్లయింగ్‌, డోన్స్‌ ఫ్లయింగ్‌ వంటి ప్రక్రియల ద్వారా సమగ్రంగా పారదర్శకతతో చేపట్టి నిర్దేశిత సమయానికి దీనిని పూర్తిచేయాలన్నారు. మీ భూమి-మీహక్కు నినాదంతో సర్వే కొనసాగుతుందన్నారు. భూ అమ్మకాలు కొనుగోలు  పారదర్శక తతో నిర్వహించడానికి భావితరాలకు వివాదాలు లేని ఆస్తులు అప్పగించేం దుకు ఈ ప్రక్రియ దోహదపడాలన్నారు. ప్రతీ భూసమస్యకు పరిష్కార మార్గా లు చూపాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు. గ్రౌండ్‌ ట్రూ తింగ్‌ స్టోన్‌ ప్లాంటేషన్‌, సరిహద్దు రాళ్లు ఏర్పాటు ప్రతిభూమికి పార్సెల్‌ నెంబర్‌ జనరేట్‌ చేయడం వంటి వాటిని చేపట్టి తద్వారా ఆక్రమణలను తొలగించి స్వచ్ఛమైన భూరికార్డులను తయారు చేయాలని ఆదేశించారు. భూరికార్డుల  స్వచ్ఛీకరణకు సంబంధించిన ఆరు రకాల ప్రొఫార్మాలను ఖచ్చితత్వంతో కూడిన సమాచారంతో నింపాలని అన్నారు. ప్రభుత్వ ఖర్చుతోనే  సరిహద్దు రాళ్లను వేస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా లిటిగేషన్‌కు ఆస్కారం లేకుండా సమగ్ర భూముల రీసర్వే  చేపట్టాలని సబ్‌కలెక్టర్‌ చెప్పారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ జి.బాలసుబ్రహ్మణ్యం, డిప్యూటీ ఇనస్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే గాలిబ్‌సాహెబ్‌, ఆర్‌.ఐ జి.రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement