శరద్ యాదవ్‌తో లాలూ భేటీ

ABN , First Publish Date - 2021-08-04T01:13:01+05:30 IST

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్

శరద్ యాదవ్‌తో లాలూ భేటీ

న్యూఢిల్లీ : రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం మాజీ కేంద్ర మంత్రి శరద్ యాదవ్‌‌ను కలిశారు. ఇరువురు దాదాపు గంటకు పైగా మాట్లాడుకున్నారు. లాలూతోపాటు ఎంపీలు ప్రేమ్ చంద్ గుప్తా, మీసా భారతి ఉన్నారు. శరద్ యాదవ్ చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. 


లాలూ విలేకర్లతో మాట్లాడుతూ, శరద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, తాను సామ్యవాద నేతలమని, తమ వంటి సామ్యవాద నేతలు లేకపోవడం వల్ల పార్లమెంటులో ప్రజలకు సంబంధించిన సమస్యలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఎల్‌జేపీ నేత చిరాగ్ పాశ్వాన్‌ను ప్రశంసించారు. పార్టీలో విభేదాలు వచ్చినప్పటికీ, నాయకుడిగా చిరాగ్ ఎదిగారని చెప్పారు. ఆయన వైపు ప్రజలు ఉన్నారని అన్నారు. 


ఎల్‌జేపీలో చిరాగ్‌తో సహా  ఆరుగురు ఎంపీలు ఉన్నారు. వీరిలో ఆయన మినహా మిగిలినవారంతా పశుపతి పరాస్‌తో కలిసి ఆ పార్టీని వదిలిపెట్టేశారు. పశుపతి కూడా ఎల్‌జేపీ ఎంపీ. ఆయన చిరాగ్‌కు సమీప బంధువు. పశుపతికి ఇటీవల కేంద్ర మంత్రి పదవి లభించింది. 


Updated Date - 2021-08-04T01:13:01+05:30 IST