మహిళా సీఐ, స్నేహితుల ఇళ్లలో Acb తనిఖీలు

ABN , First Publish Date - 2022-02-13T15:41:32+05:30 IST

పలు కేసుల నుంచి అవినీతిపరులను కాపాడేందుకు పెద్ద మొత్తంలో లంచం పుచ్చుకున్న మహిళా సీఐ, ఆమె స్నేహితుల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం వేకువజామున ఆకస్మికతనిఖీలు

మహిళా సీఐ, స్నేహితుల ఇళ్లలో Acb తనిఖీలు

- రూ.5 లక్షల స్వాధీనం

- బ్యాంక్‌ ఖాతాలో రూ.1.25 కోట్లు వున్నట్లు వెల్లడి


ప్యారీస్‌(చెన్నై): పలు కేసుల నుంచి అవినీతిపరులను కాపాడేందుకు పెద్ద మొత్తంలో లంచం పుచ్చుకున్న మహిళా సీఐ, ఆమె స్నేహితుల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం వేకువజామున ఆకస్మికతనిఖీలు నిర్వహించారు. ఇందులో రూ.5 లక్షల నగదు, బ్యాంక్‌ ఖాతాలో రూ.1.25 కోట్లు డిపాజిట్‌ చేసిన పత్రాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ అవినీతిపై పోలీసులు తెలిపిన వివరాల మేరకు, కన్నియాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌ మహిళా పోలీస్ స్టేషన్‌ సీఐగా పనిచేస్తున్న కన్మణి, ఆమె భర్త, ప్రభుత్వ న్యాయవాది జేవియర్‌ పాండ్యన్‌ ఆదాయానికి మించి ఆస్తులు కూటబెట్టుకున్నారని నాగర్‌కోయిల్‌ అవినీతి నిరోధక శాఖకు పలు ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో, శనివారం ఉదయం 6 గంటలకు కన్మణి నివసిస్తున్న ఇళ్లు, ఆమె స్నేహితులు ఇళ్లలో ఏసీబీ డీఎస్పీ పీటర్‌పాల్‌ నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. ఇందులో కన్మణి ఇంటి నుంచి రూ.5 లక్షల నగదు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, 756 కొత్త పాదరక్షలు, పెట్టెల్లో ఉన్న మాస్క్‌లు, శానిటైజర్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంట్లో ఓ గది మొత్తం ఉన్న గిఫ్ట్‌ బాక్స్‌లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవలి కాలంలో కన్మణిపై ఎలాంటి అవినీతి ఫిర్యాదులు నమోదుకాలేదని, అయితే ఆమె తన భర్తతో కలసి గుట్టుచప్పుడు కాకుండా లంచం పుచ్చుకొని అవినీతిపరులను కాపాడారని పోలీసు వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-02-13T15:41:32+05:30 IST