మహిళల రక్షణపై అవగాహన సదస్సు

ABN , First Publish Date - 2021-10-26T13:29:31+05:30 IST

మహిళల రక్షణపై అవగాహన సదస్సు సోమవారం జరిగింది. తిరువళ్లూర్‌ జిల్లా గుమ్మిడిపూండి యూనియన్‌ పంజెట్టి గ్రామంలోని వేలమ్మాళ్‌ మెట్రిక్యులేషన్‌ హయర్‌ సెకండరీ పాఠశాలలో రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో

మహిళల రక్షణపై అవగాహన సదస్సు

గుమ్మిడిపూండి(Chennai): మహిళల రక్షణపై అవగాహన సదస్సు సోమవారం జరిగింది. తిరువళ్లూర్‌ జిల్లా గుమ్మిడిపూండి యూనియన్‌ పంజెట్టి గ్రామంలోని వేలమ్మాళ్‌ మెట్రిక్యులేషన్‌ హయర్‌ సెకండరీ పాఠశాలలో రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు ముఖ్యఅతిథిగా గుమ్మిడిపూండి డీఎస్పీ రీతు హాజరయ్యారు. రోడ్డు ప్రమాదాలు, రోడ్డుపై వెళుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలు, మహిళల రక్షణ, బాల్య వివాహాల నిరోధం తదితరాలపై డీఎస్పీ వివరించారు. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలసుబ్రమణ్యం, వైద్యులు ప్రవీణ్‌, గౌతమి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంతితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-26T13:29:31+05:30 IST