రోగ నిర్ధారణ.. ఇలాగేనా?

ABN , First Publish Date - 2021-06-18T04:20:17+05:30 IST

ఇప్పుడసలే కరోనా కాలం! ఏమా త్రం అనారోగ్యంగా ఉన్నా పరీక్షలు చేయించుకునేందుకు పరుగులు తీసే కాలం! ఇలాంటి పరిస్థితుల్లో రోగుల అత్యవసరాన్ని ఆసరాగా తీసుకుని కొందరు రోగ నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

రోగ నిర్ధారణ.. ఇలాగేనా?
నామమాత్రపు పరికరాలతో పరీక్ష కేంద్రాలు నిర్వహిస్తున్నారు

అనుమతులు లేకుండానే వెలుస్తున్న రోగ నిర్ధారణ కేంద్రాలు

కనీస ప్రమాణాలను పాటించని నిర్వాహకులు

రోగుల నుంచి అడ్డగోలుగా వసూళ్లు

జీవ వ్యర్థాల నిర్వహణ ఊసే లేదు

అర్హత లేని వారితో పరీక్షలు నిర్వహిస్తున్న తీరు

భద్రాచలం, జూన్‌ 17: ఇప్పుడసలే కరోనా కాలం! ఏమా త్రం అనారోగ్యంగా ఉన్నా పరీక్షలు చేయించుకునేందుకు పరుగులు తీసే కాలం! ఇలాంటి పరిస్థితుల్లో రోగుల అత్యవసరాన్ని ఆసరాగా తీసుకుని కొందరు రోగ నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కనీస ప్రమాణాలు పాటించకుండానే ఇళ్లల్లోనే రక్త పరీక్షల నిర్వహిస్తున్నారు. కనీసం జీవ సంబంధ వ్యర్థాలను కూడా ఇష్టానుసారంగా పడేస్తున్నారు. అనుమతులు లేకుండానే రోగ నిర్ధారణ కేం ద్రాలను ఏర్పాటు చేస్తూ, అర్హత లేనివారితో పరీక్షలు నిర్వహిస్తున్నారు.  అడిగే వారు లేరనే ధైర్యంతో భద్రాద్రిలో ఇటీవల కాలంగా ఇష్టానుసారంగా రోగ నిర్ధారణ కేంద్రాలు అధిక సంఖ్యలో వెలుస్తున్నాయి. పూర్తిస్థాయి వైద్య పరికరా లు, నిపుణులైన సిబ్బంది ఏర్పాటు చేసుకోకుండా, అధికారి కంగా వైద్యఆరోగ్యశాఖ అనుమతి లేకుండానే వీటిని నిర్వ హిస్తుండటం గమనార్హం.

అధికశాతం కేంద్రాల్లో నిబంధనలకు నీళ్లు

భద్రాచలంలోని అధిక శాతం రోగ నిర్ధారణ కేంద్రాల్లో నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. కేంద్రం ఏర్పాటు చేసే సమయంలో వైద్యపరీక్షలకు అవసరమైన అన్ని రకాల పరికరాలు, సిబ్బంది జీవ సంబంధ వ్యర్థాల నిర్వ హణకు సంబంధించిన అనుమతులు తప్పనిసరి. అలాగే ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, పాథాలజీ చది వి ఐదేళ్లు అనుభవం ఉన్న వారే ల్యాబ్‌లను నిర్వహించా లనే నిబంధన ఉంది. అలాగే డాక్టర్‌ పర్యవేక్షణతో చిన్న ల్యాబ్‌లను నిర్వహించాలి. కానీ చాలా చోట్ల ఇటువంటి కనీస ప్రమాణాలను పాటించకుండా ల్యాబ్‌ల నిర్వాహ కులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు  వ్యక్తమవుతున్నాయి. 

జీవసంబంధ వ్యర్థాల నిర్వహణ ఊసే లేదు

రోగ నిర్ధారణ కేంద్రాల్లో అత్యంత కీలకమైన అంశం జీవ సంబంధ వ్యర్థాల నిర్వహణ. ఎందుకంటే రోగుల నుంచి రక్తం, ఇతరత్రా వాటిని సేకరించిన అనంతరం పరీక్షలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పరీక్షల అనంతరం ఆ రక్తాన్ని, అందుకు వినియోగించిన సిరంజీలను వాటిని భద్రపరిచి జీవ సంబంధ వ్యర్థ నిర్వాహకులకు అప్పగిం చాలి. కానీ ఇటువంటి పద్ధతులు ఏవీ అధిక శాతం పరీక్ష కేంద్రాల్లో లేవని తెలుస్తోంది. అయితే ఇటీవల కాలంలో కొంతమంది రోగుల ఇళ్ల నుంచి రక్తనమూనాలను సేకరిం చి ఇళ్లల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. ఈ విధంగా చేయడం ప్రభుత్వ నిబంధనలకు విరు ద్ధమని వైద్యాధికారులు చెబుతున్నారు.

అనుమతులు లేకుండానే వెలుస్తున్న కేంద్రాలు

భద్రాచలంలో రోగ నిర్ధారణ కేంద్రాలు అనుమతులు లేకుండానే కుప్పలుతెప్పలుగా వెలుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అర్హత లేని వారు సైతం రోగ నిర్ధారణ కేంద్రా లను ఏర్పాటు చేయడంతో భద్రాచలం ఏజెన్సీ ప్రాం తంలోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఈ విషయంపై కనీస అవగాహన లేక అర్హతలేని వారి వద్ద ఇబ్బందుల పాలైన సంఘటనలు లేకపోలేదని వైద్యులు పేర్కొంటున్నారు. రోగ నిర్ధారణ కేంద్రం కోసం దరఖాస్తు చేసి అనుమతి రాకుండానే కేంద్రాలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులకు అనుమతి కో సం దరఖాస్తు చేసే సమయంలో జీవ సంబంధ వ్యర్థాల నిర్వహణ ఏ విధంగా చేస్తారో, అందుబాటులో వైద్య పరిక రాలు ఏం ఉన్నాయో, పని చేసే సిబ్బంది అర్హత ధృవీకరణ పత్రాలు తదితర వివరాలను పొందుపర్చి అందుకు అను గుణంగా చర్యలు చేపట్టాల్సి ఉండగా ఆ విధంగా చేయడం లేదని తెలుస్తోంది. అయితే వైద్య ఆరోగ్యశాఖ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగిన వారితో రోగ నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉన్నా ఆ దిశగా చేయడం లేదనే  విమర్శలున్నాయి. అనుమతులు, అర్హత లేకున్నా తమకు వచ్చిన మేరకు రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఫీజులు మాత్రం రోగుల నుంచి భారీ ఎత్తున వసూలు చేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

చట్టపరంగా చర్యలు తీసుకుంటాం

డాక్టర్‌ వెంకటేశ్వరరావు, డీడీఎంహెచ్‌వో

నిబంధనలకు విరుద్దంగా రోగ నిర్దారణ కేంద్రాలు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రోగ నిర్దారణ కేంద్రాలను తనిఖీ చేస్తున్నాం. అర్హత కలిగిన వారితో కా కుండా అర్హత లేని వారితో పరీక్షలు నిర్వహిస్తే చట్టపరం గా చర్యలు తప్పవు. అనుమతులు లేకుండా కేంద్రాలను ని ర్వహిస్తే వాటిని మూసివేస్తాం. జీవ సంబంధిత వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారించకపోతే చర్యలు తప్పవు.

Updated Date - 2021-06-18T04:20:17+05:30 IST