బహుళ అంతస్తుల భవనాన్ని ఢీకొన్న రష్యా క్షిపణి

ABN , First Publish Date - 2022-02-26T20:44:53+05:30 IST

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ రష్యా సైనిక చర్యతో విలవిల్లాడుతోంది. ఉక్రెయిన్ సైన్యం ..

బహుళ అంతస్తుల భవనాన్ని ఢీకొన్న రష్యా క్షిపణి

కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ రష్యా సైనిక చర్యతో విలవిల్లాడుతోంది. ఉక్రెయిన్ సైన్యం  మాత్రం వీరోచితంగా ప్రతిఘటిస్తుండగా, రష్యా సైనిక బలగాల బాంబు దాడులతో రాజధాని సహా పలు నగరాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. సైనిక స్థావరాలపైనే తాము దాడులు జరుపుతున్నట్టు రష్యా చెబుతున్నప్పటికీ  జనావాసాలను సైతం బాంబులు తాకుతున్నాయి. తాజాగా కీవ్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనాన్ని రష్యా క్షిపణి తాకడంతో ఆ భవనం పూర్తిగా దెబ్బతింది. ఇందుకు సంబంధించి భవంతిలో నివసించే వారే తీసినట్టుగా చెబుతున్న ఒక వీడియో అక్కడి పరిస్థితిని అద్దంపడుతోంది.


క్షిపణి తాకిడితో ఎంతమంది క్షతగాత్రులయ్యారనేది ఇంకా నిర్ధారించలేదని, క్షిపణి తాకిడికి ఐదు అంతస్తులు బాగా దెబ్బతినడంతో భవనంలోని వారిని బయటకు తరలిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. టవర్ బ్లాక్‌కు సంబంధించిన ఒక ఫోటోను కూడా అధికారులు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. బహుళ అంతస్తుల భవనాన్ని క్షిపణి తాకినట్టు కీవ్ మేయర్ ధ్రువీకరించారు.

Updated Date - 2022-02-26T20:44:53+05:30 IST