Lifting of ban: కుట్రాలం జలపాతాల్లో నిషేధం ఎత్తివేత
ABN , First Publish Date - 2022-08-10T16:23:09+05:30 IST
తెన్కాశి జిల్లా కుట్రాలం ఐదు జలాపాతాల్లో స్నానాలకు విధించిన నిషేధం మంగళవారం మధ్యాహ్నం ఎత్తివేయడంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో
- పర్యాటకుల సందడి
ప్యారీస్(చెన్నై), ఆగస్టు 9: తెన్కాశి జిల్లా కుట్రాలం ఐదు జలాపాతాల్లో స్నానాలకు విధించిన నిషేధం మంగళవారం మధ్యాహ్నం ఎత్తివేయడంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన కుట్రాలంలో ఉన్న ఐదు జలపాతాల్లో స్నానాలు చేసేందుకు సందర్శకులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఇటీవల కురిసిన భారీవర్షాల కారణంగా ఈ జలపాతాల్లో వరద ఉధృతంగా సాగుతుండడంతో పర్యాటకుల స్నానాలకు పోలీసులు నిషేధం విధించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన కారణంగా జలపాతం(waterfall) ఉదృతి కూడా తగ్గింది. దీంతో స్నానాలకు విధించిన నిషేధాన్ని మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎత్తివేశారు. నిషేధం(Prohibition) లేకపోవడంతో పర్యాటకులు ఉత్సాహంగా జలపాతాల వద్ద బారులుతీరి స్నానాలు చేస్తూ సందడి చేశారు.