Abn logo
Oct 27 2021 @ 08:03AM

AP: డివైడర్‌ను ఢీకొని బోల్తా పడిన బస్సు...డ్రైవర్ మృతి

కర్నూలు: జిల్లాలోని కల్లూరు మండలం ఉలిందకొండ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న ఎన్‌హెచ్44 హైవేపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్‌‌ను ఢీకొని ఆపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు  డ్రైవర్ చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే ఏడుగురు ప్రయాణికులకు గాయాలవగా..ముగ్గురికి తీవ్రంగా గాయాలవడంతో వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుండి పలమనేరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇవి కూడా చదవండిImage Caption