కర్నూల్ (Kurnool) జిల్లా: ఓర్వకల్లు మండలంలోని హుస్సేనాపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కర్నూలు వైపు వెళ్తున్న మినీ లారీని రాంగ్ రూట్లో వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
ఇవి కూడా చదవండి