Abn logo
Jul 14 2021 @ 14:40PM

మంత్రి పెద్దిరెడ్డి పేరిట వాహనం కలకలం

కర్నూలు జిల్లా: శిరువెళ్ల మండలం, గోవిందపల్లె గ్రామ శివారులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో ఉన్న వాహనం చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. అనుమానస్పదంగా తిరుగుతున్న వాహనాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అప్రమత్తమై ఆ వాహనాన్ని వెంబడించారు. పోలీసుల రాకను గమనించిన దుండగులు వాహనాన్ని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలి వెళ్లారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

క్రైమ్ మరిన్ని...