జీవనశైలి మార్పులతో గుండె జబ్బులు దూరం: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-09-30T17:09:24+05:30 IST

మంచి ఆహారం, జీవనశైలి మార్పులతో గుండె పోటు రాకుండా జాగ్రత్త పడవచ్చునని ..

జీవనశైలి మార్పులతో గుండె జబ్బులు దూరం: కలెక్టర్‌

కర్నూలు: మంచి ఆహారం, జీవనశైలి మార్పులతో గుండె పోటు రాకుండా జాగ్రత్త పడవచ్చునని కలెక్టర్‌ జీ.వీరపాండియన్‌ అన్నారు. మంగళశారం ప్రపంచ హృదయ దినోత్సవంను పురస్కరించుకుని కర్నూలు మెడికల్‌ కాలేజ్‌లోని న్యూ లెక్చరర్‌ గ్యాలరీలో మెడిసిన్‌ విభాగం ఏర్పాటు చేసిన పద్మభూషణ్‌ డా.శ్రీపాద పినాకపాణి విగ్రహాన్ని కలెక్టర్‌ ఆవిష్కరించారు. అనంతరం పూలమాల వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డా.శ్రీపాద పినాకపాణి మెమోరియల్‌ లెక్చరర్‌ హాల్‌-2ను ప్రారంభించారు.


ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పద్మభూషణ్‌ అవార్డు గ్రహిత డా.శ్రీపాద పినాకపాణి విగ్రహాన్ని కళాశాలలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డా.పి.చంద్రశేఖర్‌, డా.శ్రీపాద పినాకపాణి కుమారుడు డా.మువ్వ గోపాల్‌, కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.జి.నరేంద్రనాథ్‌ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డా.కె.నరసింహులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-30T17:09:24+05:30 IST