Kurnoolలో ఎలుగుబంట్ల హల్‌చల్

ABN , First Publish Date - 2022-01-07T14:13:01+05:30 IST

జిల్లాలోని శ్రీశైలం మండలంలో అర్ధరాత్రి ఎలుగుబంట్లు హల్‌చల్ చేసింది.

Kurnoolలో ఎలుగుబంట్ల హల్‌చల్

కర్నూలు: జిల్లాలోని శ్రీశైలం మండలంలో అర్ధరాత్రి ఎలుగుబంట్లు హల్‌చల్ చేస్తున్నాయి. నివాస గృహాలలోకి ఎలుగుబంట్లు వస్తుండటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలానికి సమీపంలోని సున్నిపెంట గ్రామంలో పూర్ణానంద ఆశ్రమం, బండ్లబజార్ ప్రాంతాలలో మూడు రోజుల నుంచి ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపుతోంది. మూడు రోజుల నుంచి గ్రామంలోకి వస్తున్న ఎలుగుబంట్లను అడవిలోకి పంపేందుకు ఫారెస్ట్ అధికారులు  ప్రయత్నిస్తున్నారు. టపాసులు కాలుస్తూ ఎలుగుబంట్లను తరుముతున్నప్పటికీ రెండు ఎలుగుబంట్లు తిరిగి జనావాసాలలోకి వస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2022-01-07T14:13:01+05:30 IST