Abn logo
Apr 8 2021 @ 11:27AM

కుంభమేళాలో ఘాట్లకు సాధువుల పేర్లు

డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): కుంభమేళా సందర్భంగా స్నాన ఘాట్లకు సాధువుల పేర్లు పెట్టాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ అధికారులను ఆదేశించారు. కుంభమేళాలో పాల్గొనే అఖాడాల కోసం ఘాట్లలో భూమిని కేటాయించాలని సీఎం కోరారు.సీఎం ఆదేశంతో కుంభమేళా అధికారి దీపక్ రావత్ అఖాడాల కోసం భూమిని కేటాయించడంతోపాటు ఘాట్లకు సాధువుల పేర్లు పెట్టారు. నాసిక్, హరిద్వార్, ప్రయాగరాజ్, ఉజ్జయినిలలో కుంభమేళా ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వల్ల కుంభమేళాను నాలుగునెలల నుంచి నెలరోజులకు తగ్గించారు.కరోనా వ్యాప్తి సందర్భంగా కుంభమేళాలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.

Advertisement
Advertisement
Advertisement