చాలా ఆనందంగా ఉంది.. మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

ABN , First Publish Date - 2020-08-10T14:33:10+05:30 IST

హైదరాబాద్‌ ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో ఎల్‌బీనగర్‌, కర్మన్‌ఘాట్‌ల మధ్య బైరామల్‌గూడ జంక్షన్‌లో నిర్మిం చిన ఫ్లైఓవర్‌ను సోమవారం ప్రారంభి స్తున్నామని

చాలా ఆనందంగా ఉంది.. మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

బైరామల్‌గూడ జంక్షన్‌పై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో ఎల్‌బీనగర్‌, కర్మన్‌ఘాట్‌ల మధ్య బైరామల్‌గూడ జంక్షన్‌లో నిర్మిం చిన ఫ్లైఓవర్‌ను సోమవారం ప్రారంభి స్తున్నామని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశా రు. మరో కొత్త ఫ్లైఓవర్‌ను ప్రారంభిం చడం ఆనందంగా ఉందన్నారు. వ్యూహా త్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో బైరామల్‌ గూడ జంక్షన్‌ లో కుడివైపు 780 మీటర్ల పొడవుతో రూ.26.5 కోట్ల వ్యయంతో నిర్మించి న ఫ్లైఓవర్‌  అందుబాటులోకి రానుందని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.  


అలకాపూర్‌ రోడ్లపైనా... 

రోడ్డు సమస్యపై ఒకరు చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్‌ స్పందించారు. అలకాపూర్‌ కాలనీలో అంతర్గత రోడ్డు కోసం శంకుస్థాపన జరిగి ఏడాది గడుస్తున్నా నిర్మించలేదని, తమ రోడ్డు సమస్యను పట్టించుకోవాలని స్థానిక సామాజిక కార్యకర్త మనోజ్‌కుమార్‌ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. దీనికి రీట్వీట్‌ చేసిన మంత్రి కేటీఆర్‌ రోడ్డు పనులు వెంటనే చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలకాపూర్‌ కాలనీలో అంతర్గత రోడ్డు కోసం ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ ఏడాదిన్నర క్రితం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మణికొండ మున్సిపాలిటీ ఆ రోడ్డు పనులు పూర్తి చేయలేదు. స్థానికులు ఈ విషయాన్ని రంగారెడ్డి జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, రోడ్డును పరిశీలించి పనులు చేపట్టాలని మునిసిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. అయినా, పనులు మొదలు కాలేదు. దీంతో స్థానికులు కేటీఆర్‌కు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన మంత్రి ఇలా రీట్వీట్‌ చేశారు. 

Updated Date - 2020-08-10T14:33:10+05:30 IST