తెలంగాణ సమాజానికి కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలి

ABN , First Publish Date - 2022-07-04T06:03:07+05:30 IST

తెలంగాణ ఉద్యమ బలోపేతానికి మార్గ దర్శకుడు ప్రొఫెసర్‌ జయ శంకర్‌, తెలంగాణ సాధనలో ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంత చారిలను అగౌరవపరిచే విధంగా వాఖ్యలు చేసిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తక్షణమే యావత్‌ తెలంగాణ సమా జా నికి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

తెలంగాణ సమాజానికి కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలి
ఎమ్మెల్సీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన వైస్‌ చైర్‌ పర్సన్‌

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

జగిత్యాల టౌన్‌, జూలై 3: తెలంగాణ ఉద్యమ బలోపేతానికి మార్గ దర్శకుడు ప్రొఫెసర్‌ జయ శంకర్‌, తెలంగాణ సాధనలో ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంత చారిలను అగౌరవపరిచే విధంగా వాఖ్యలు చేసిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తక్షణమే యావత్‌ తెలంగాణ సమా జా నికి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం లోని 11వార్డు గాంధీనగర్‌, అమినాబాద్‌కు చెందిన 100 మంది ముస్లిం నాయకులు ఆదివారం ఎమ్మెల్సీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరగా జీ వన్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ హయాం లో ధనిక వర్గాలకు ప్రాధాన్యం కల్పిస్తూ నిరుపేద వర్గాలను వివక్షకు గు రిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండవ సారి అధికారంలోకి వ చ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నేటికి ఒక్కరికి కూడా కొత్త రేషన్‌ కార్డుతో పాటు ఫించన్‌ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్‌ హయాంలో అన్ని వర్గాలకు అండగా నిలిచామని గుర్తు చేశారు. నిరుద్యోగ యువతకు ఎంత మం దికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారో లెక్కలు చెప్పాలన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమం ఏమైందని పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా విద్యార్థులకు యూనిఫాం, పాఠ్య పుస్తకాలు అందించలేద న్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన వాగ్థానం ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం వార్డులో కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్ర టరీ బండ శంకర్‌, పీసీసీ సభ్యుడు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గిరి నాగ భూషణం, పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కొత్త మోహన్‌, ప్లోర్‌ లీడర్‌ కల్లెపల్లి దుర్గయ్య, నాయకులు రమేష్‌రావు, జీవన్‌, మన్సూర్‌, గుండ మధు, అశోక్‌, రవి ఉన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన సింగిల్‌ విండో వైస్‌ చైర్‌ పర్సన్‌ 

కొడిమ్యాల: కొడిమ్యాల సింగిల్‌ విండో వైస్‌ చైర్‌ పర్సన్‌ గడ్డం కవితచంద్రమొహన్‌రెడ్డి దంపతులు టీఆర్‌ఎస్‌ పార్టీ క్రియాశీలక సభ్య త్వానికి శనివారం రాజీనామా చేశారు. ఆదివారం జగిత్యాలలో ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మహిపాల్‌రెడ్డ్డి, కేంద్ర సహకార బ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌ మల్లిఖార్జున్‌రెడ్డ్డి, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షు డు నారాయణగౌడ్‌, కొడిమ్యాల ఉప సర్పంచు జీవన్‌రెడ్డ్డి, సింగిల్‌ విండో డైరెక్టర్‌ నాగభూషణ్‌రెడ్డ్డి, మాజీ ప్రజాప్రతినిధులు బాస్కర్‌రెడ్డి లక్ష్మారెడ్డ్డి ప్రభాకర్‌రెడ్డ్డి, నాయకులు వీరారెడ్డి, రవి, నర్సయ్య, లక్ష్మారెడ్డ్డి పాల్గొన్నారు.  


Updated Date - 2022-07-04T06:03:07+05:30 IST