ఎస్సీ సబ్‌ప్లాన్‌ ఉల్లంఘనలకు కేటీఆర్‌దే బాధ్యత

ABN , First Publish Date - 2021-01-25T06:19:35+05:30 IST

ఎస్సీల అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎస్సీ సబ్‌ప్లాన్‌ తీసుకువచ్చి చట్టబద్ధత కల్పించిందని, రామగుండంలో సబ్‌ప్లాన్‌ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, దీనికి మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మంథని ఎమెల్యే శ్రీ ధర్‌బాబు పేర్కొన్నారు.

ఎస్సీ సబ్‌ప్లాన్‌ ఉల్లంఘనలకు కేటీఆర్‌దే బాధ్యత
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

- ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు

గోదావరిఖని, జనవరి 24: ఎస్సీల అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎస్సీ సబ్‌ప్లాన్‌ తీసుకువచ్చి చట్టబద్ధత కల్పించిందని, రామగుండంలో సబ్‌ప్లాన్‌ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, దీనికి మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మంథని ఎమెల్యే శ్రీ ధర్‌బాబు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజలకు మౌలిక సదుపాయా లు కల్పించాల్సిన బాధ్యత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లే కానీ ఎమ్మెల్యే గౌరవ సభ్యుడి హోదా పెద్దమనిషి పాత్ర పోషించి అవకతవకలు జరుగకుండా చూడాలన్నారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధు లు నాన్‌ఎస్సీ లొకాలిటీలో పెట్టడమేమిటని ప్రశ్నించారు. మెజార్టీలో ఉ న్నా కూడా నిబంధనలు, ప్రజా అవసరాల దృష్ట్యా నిధులు కేటాయించాలన్నారు. నిబంధనల ప్రకారం ఎస్సీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయించాలే కానీ, సొంత పార్టీ కార్పొరేటర్లు, సింగరేణి ప్రాంతాల్లో నిధులు కేటాయించడమేమిటని ప్రశ్నించారు. సిం గరేణి ప్రాంతాల్లో సంస్థ అభివృద్ధి చేస్తుంది కానీ, మీరు పనులు చేయడమేమిటని ప్రశ్నించారు. మున్సిపల్‌ చట్టం ప్రకారం కలెక్టర్‌ మున్సిపాలి టీలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని, రామగుండంలో సబ్‌ప్లాన్‌ ని ధుల కేటాయింపులో జరిగిన అన్యాయం గురించి జాతీయ పార్టీ కార్పొరేటర్లు వినతిపత్రం ఇవ్వడానికి వెళితే సమయం ఇవ్వకుండా అరెస్టు చే యడమేమిటని ప్రశ్నించారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశ మందిరానికి 40మంది పోలీసులు రావడమేమిటని, సమావేశ మందిరంలోకి పో లీసులు వచ్చే అధికారం ఎవరిచ్చారన్నారు. మున్సిపల్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌ కార్పొరేటర్లను అర్ధరాత్రి దాటిన తరువాత బలవంతం గా అరెస్టు చేయడం, నలుగురు పురుష కార్పొరేటర్లను పోలీస్‌ స్టేషన్‌ నుంచి వాహనాల్లో ఎక్కించుకుని ఓపెన్‌కాస్టుల చుట్టూ జన సంచారం లేని ప్రాంతాల్లో తిప్పుతూ భయాందోళనకు గురిచేశారని, వారు ప్రజాప్రతినిధులను టెర్రరిస్టులు, కరుడుగట్టిన నేరస్థుల్లా తిప్పడమేమిటని, దీని ని డీజీపీ దృష్టికి తీసుకెళతామన్నారు. మహిళా కార్పొరేటర్లను మహిళా పోలీసులు లేకుండా అర్ధరాత్రి అరెస్టుచేసి తెల్లవారు వరకు పోలీస్‌స్టేషన్‌లో ఉంచడం ఫ్రెండ్లీ పోలీసింగ్‌గా అని ప్రశ్నించారు. రామగుండం కౌన్సి ల్‌ హాల్‌లోకి పోలీసులు రావడం, కార్పొరేటర్లను నెట్టివేయడం, అర్ధరాత్రి అరెస్టు చేయడంపై కమిషనర్‌ జవాబు చెప్పాలన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్ణయాల్లో పోలీసులకు భాగస్వామ్యం కల్పించారా అని, దీనికి మున్సిపల్‌ మంత్రి  కేటీఆర్‌, రామగుండం పోలీస్‌ కమిషనర్‌ జవాబు చెప్పాలన్నారు. రామగుండంలో రాజకీయాల్లో కొత్త చరిత్ర రాస్తున్నారని, ఇది ఎమ్మెల్యేకు మంచిదికాదన్నారు. రా జకీయాలకతీతంగా అతన్ని స్వతంత్ర అభ్యర్థిగా ప్రజలు గెలిపించారని, టీఆర్‌ఎస్‌కు అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ ఈప్రాంతానికి చేసిందేమిటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత భద్రాది పవర్‌ప్లాంట్‌ కొత్తగా నిర్మించారని, రామగుండంలో మాత్రం బీ పవర్‌హౌస్‌ను విస్తరించడమో, సూపర్‌ థర్మల్‌ క్రిటికల్‌గా నిర్మించడమో చేయలేదన్నారు. ఎ న్నికల్లో ఓసీపీలను అడ్డుకుంటామన్న చందర్‌ ఫైవింక్లయిన్‌ గనిని మూసివేసి ఓపెన్‌కాస్టుగా మారుస్తుంటే ఏం చేస్తున్నాడన్నారు. యువరాజు కేటీఆర్‌కు సన్నిహితుడిగా చెప్పుకునే ఆ యన మెడికల్‌ కాలేజీ కానీ, ఐటీ కారిడార్‌ కానీ, ఇతర అభి వృద్ధికి నిధులు కానీ తెచ్చారా అని ప్రశ్నించారు. రామగుం డంలో కాంగ్రెస్‌ కార్పొరేటర్లపై వివక్ష కాదు, దళితులపై వివక్ష అని ఆయన ఉద్ఘాటించారు. పోలీసులు బాధ్యతలు గుర్తెరగాలని, అతిగా ప్రవర్తిస్తే శిక్షలకు గురవుతారని జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు హెచ్చరించారు. కలెక్టర్‌ కౌన్సిల్‌ ఎజెండా అవకతవకలను సరిచేయాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూ ర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య, ఐత ప్రకాష్‌రెడ్డి, ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్‌ ప్రసాద్‌, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేష్‌, కొలిపాక సుజాత, ముదాం శ్రీనివాస్‌, పెద్దెల్లి తేజస్విని, గాదం విజయ, నగునూరి సుమలత, దాసరి సావిత్రి, ఎండీ ముస్తాఫా, సనా ఫకృద్దీన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-25T06:19:35+05:30 IST