16 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల

ABN , First Publish Date - 2022-08-20T05:59:48+05:30 IST

ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ 16 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి ని విడుదల చేస్తున్నారు.

16 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల
క్రస్ట్‌గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

విజయపురిసౌత్‌, ఆగస్టు 19: ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ 16 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి ని విడుదల చేస్తున్నారు.  శ్రీశైలం నుంచి సాగర్‌కు 1,74,167 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ నుంచి 1,74,160 క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేస్తున్నారు.  ప్రాజెక్ట్‌ నీటిమట్టం శుక్రవారం నాటికి 586.20 అడుగులు ఉంది. ఇది 301.35 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 600 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 5,193, కుడి కాలువ ద్వారా 8,831, వరద కాలువ ద్వారా 400, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 32,927, 16 క్రస్ట్‌గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,23,216 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 1,74,167  క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో వాటర్‌గా 1,74,167 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.80 అడుగులుంది. ఇది 214.84 టీఎంసీలకు సమానం.  

 పులిచింతలకు 1,48,014 క్యూసెక్కులు

రెంటచింతల: సత్రశాలలోని కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నుంచి పులిచింతలకు 1,48,014 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 8 క్రస్ట్‌గేట్లను మూడున్నర మీటర్ల మేర, 1 గేటును మీటరన్నర మేర ఎత్తి  నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన వున్న సాగర్‌ నుంచి 1,55,366 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు వస్తోంది. రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 7.080 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.186 టీఎంసీల నీరు ఉంది. 

బ్యారేజి దిగువకు లక్షా 23వేల క్యూసెక్కులు 

తాడేపల్లి టౌన్‌: కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఎగువన ఉన్న వాగుల నుంచి ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌కు వరదనీటి ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి శుక్రవారం సాయంత్రానికి లక్షా36వేల క్యూసెక్కుల వరదనీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతున్నట్టు అధికారులు తెలిపారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 12,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. బ్యారేజి రిజర్వాయర్‌ వద్ద 12 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తూ, 30 గేట్లను 3అడుగుల మేర 40 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి లక్షా 23వేల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదులుతున్నట్టు తెలిపారు.

 

Updated Date - 2022-08-20T05:59:48+05:30 IST