హీరో అనుకుంటున్నారా?... మీరు ప్రజల సర్వెంట్: మాజీ ఎమ్మెల్యే సౌమ్య

ABN , First Publish Date - 2021-12-27T18:10:07+05:30 IST

నందిగామలో అక్రమ కట్టడాల పేరుతో కూల్చివేయడంపై మున్సిపల్ కమిషనర్‌పై సౌమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

హీరో అనుకుంటున్నారా?... మీరు ప్రజల సర్వెంట్: మాజీ ఎమ్మెల్యే సౌమ్య

కృష్ణా జిల్లా: నందిగామలో అక్రమ కట్టడాల పేరుతో కూల్చివేయడంపై మున్సిపల్ కమిషనర్‌పై మాజీ ఎమ్మెల్యే తంగారాల సౌమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనాలు కూల్చడం అహంకారానికి నిదర్శనమన్నారు. ‘మీరేమి నందిగామాకు హీరో కాదని, ప్రజలకు సర్వెంట్ అని’ ఈ విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. అధికార దాహంతో చేసే ఈ పనులకు రాబోయే రోజుల్లో ప్రజలు గట్టిగా బుద్ది చెబుతారని ఆమె హెచ్చరించారు. కూల్చివేసిన నిర్మాణాలను సౌమ్య పరిశీలించారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించారని మండిపడ్డారు. అధికారముందని మున్సిపల్ కమిషనర్ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని సౌమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-12-27T18:10:07+05:30 IST