పడగెత్తిన పీడ!

ABN , First Publish Date - 2020-06-07T08:23:10+05:30 IST

మామిడికుదురు మండలం పాసర్లపూడిలో తొలిసారిగా శనివారం పాజిటివ్‌ కేసు నమోదైంది.

పడగెత్తిన పీడ!

జిల్లా నలుమూలలకూ విస్తరిస్తున్న కొవిడ్‌

శనివారం మరో 12 పాజిటివ్‌లు నిర్ధారణ

ఇందులో మామిడికుదురు మండలం పాసర్లపూడిలో 108 డ్రైవర్‌కు కొవిడ్‌

ఆ విషయం తెలియక కొన్ని రోజులుగా మండలంలో వందల మందితో కాంటాక్టు

సఖినేటిపల్లిలో ముంబై నుంచి వచ్చిన తండ్రి, కొడుకులకు వైరస్‌ 

కాకినాడ సిటీ, వాకలపూడిలో ఇద్దరికి పాజిటివ్‌.. ఇద్దరూ వ్యాపారులే

ఒకరు ముంబై నుంచి, మరొకరు విశాఖ నుంచి తిరిగొచ్చి ఇంట్లో పార్టీతో జల్సా

గొల్లప్రోలులో ఏడేళ్ల బాలుడికి, చీడిగలో కూతురింటికి వచ్చిన ఓ మహిళకు

అయినవిల్లి, బొమ్మూరు క్వారంటైన్‌లో  చెరో ఇద్దరికి.. మండపేటలో ఓ మహిళకు

జిల్లాలో మొత్తం 371కి చేరిన కొవిడ్‌-19 కేసులు.. పెరుగుతున్న కంటైన్మెంట్‌ జోన్లు


(కాకినాడ- ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

మామిడికుదురు మండలం పాసర్లపూడిలో తొలిసారిగా శనివారం పాజిటివ్‌ కేసు నమోదైంది. ఇక్కడ స్థానిక పీహెచ్‌సీలో 108 డ్రైవర్‌గా పనిచేస్తున్న 49 ఏళ్ల వ్యక్తికి వైరస్‌ నిర్ధారణ కావడం అందరిని కలవరపెడుతోంది. అసలు ఈయనకు వైరస్‌ ఎలా సోకిందో కూడా వైద్యుల కు అంతుపట్టడం లేదు. మండలంలో ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదవకపోవడంతో ఎవరి నుంచి కొవిడ్‌ సంక్రమించిందనేది తేల్చలేకపోతున్నారు. చిన్నపాటి లక్ష ణాలుండడంతో మూడు రోజుల కిందట ఈయనకు పరీ క్షలు చేయగా, శనివారం పాజిటివ్‌ వచ్చింది. దీంతో 108లో గడిచిన కొన్నిరోజులుగా సదరు డ్రైవర్‌ ఏఏ రోగు లను ఎక్కడి నుంచి తరలించారనేదానిపై ఆరా తీయడం మొదలుపెట్టారు.


మరోపక్క సదరు డ్రైవర్‌ మండలంలో గడచిన కొన్ని రోజులుగా వందలాది మందితో కాంటాక్ట్‌ అయ్యాడు. దీంతో అనుమానితులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అటు సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో రెండు పాజిటివ్‌లు నమోదయ్యా యి. వారం కిందట ముంబై నుంచి వచ్చిన వీరిద్దరు క్వారం టైన్‌లో ఉండకుండా రహస్యంగా ఇంటికి వెళ్లిపోయారు. కొవిడ్‌ లక్షణాలు ఉండడంతో నాలుగురోజుల కిందట పరీక్ష లు చేయగా శనివారం వైరస్‌ నిర్ధారణ అయింది. బాధితుల్లో ఒకరి వయస్సు 54 ఏళ్లు.. మరొకరిది 14 ఏళ్లు. వీరిద్దరూ వరుసకు తండ్రికొడుకులు అవుతారు. తొలిసారి కేసులు నమోదవడంతో ఈ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రక టించారు. మండపేటలో ఓ మహిళకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈమె లారీ డ్రైవర్‌ అయిన తన భర్తతో కలిసి విజయవాడలో ఉంటున్నారు. గురువారం రాజమహేంద్రవ రానికి చేరుకుని కొవిడ్‌ టెస్ట్‌లు చేయించుకుని మండపేటలో మారేడుబాకలోని కొడుకు ఇంటికి శుక్రవారం వెళ్లారు. శని వారం పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అటు రాజమహేంద్ర వరం బొమ్మూరు క్వారంటైన్‌లో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. వీరిద్దరు ముంబై నుంచి వచ్చారు.


అయినవిల్లి మండలం ఎన్‌.పెద్దిపాలెంలో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. ఇటీవల హైదరాబాద్‌ నుంచి పెద్దిపాలేనికి వచ్చిన ఓ పేషెంట్‌ను పరామర్శించి రావడంతో వైరస్‌ వ్యాపించినట్టు నిర్ధారించారు. ఇదిలా ఉండగా కాకినాడలో కొన్నినెలల తర్వాత మళ్లీ కొవిడ్‌ కలకలం రేపింది. నగరంలోని కరణం గారి వీధిలో ఓ 48 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈయన ఓ పార్టీకి చెందిన చోటా నేత. గత నెల్లో వ్యాపారం పనిపై విశాఖ వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత తన ఇంట్లో గతనెల 29న స్నేహితుల తో కలిసి విందు చేసుకున్నాడు. ఈయనకు శనివారం పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో కరణంగారి జంక్షన్‌  ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించడంతోపాటు మరో 200 మీటర్ల విస్తీర్ణాన్ని కంటైన్మెంట్‌జోన్‌గా ప్రకటించారు.


అటు కాకినాడను ఆనుకుని వాకలపూడిలో వైద్యనగర్‌ రోడ్డు నెంబ ర్‌ 1లో 43 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. క్రషర్‌ వ్యాపారం చేస్తున్న ఈయన ముంబై వెళ్లి వచ్చాడు. హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన సదరు వక్తి కరణంగారి జంక్షన్‌ లోని స్నేహితుడి ఇంటికి వెళ్లి విందులో పాల్గొన్నాడు. దీంతో ఇద్దరికీ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అలాగే విజయవాడకు చెందిన 42 ఏళ్ల మహిళ లాక్‌డౌన్‌కు ముందు చీడిగలోని కూతురి ఇంటికి వచ్చింది. లాక్‌డౌన్‌ సడలింపులు ఉండడం తో గత నెల 23న తిరిగి విజయవాడ వెళ్లిపోయింది. అయితే అనారోగ్యంగా ఉండడంతో జూన్‌ 2న తిరిగి కాకినాడ వచ్చారు. కరపలో ఉద్యోగం చేస్తున్న అల్లుడి వద్దకు వెళ్తే కొవిడ్‌ టెస్ట్‌ చేయించగా పాజిటివ్‌ నిర్థారణ అయింది. అటు గొల్లప్రోలులో తొలిసారిగా పాజిటివ్‌ నమోదైంది. మల్లవరం గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలుడు ఈనెల 30న తల్లి దండ్రులతో కలిసి హైదరాబాద్‌ నుంచి ఇంటికి  చేరు కున్నారు. పరీక్షల్లో పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఈ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.

Updated Date - 2020-06-07T08:23:10+05:30 IST