కొవిడ్‌ టీకా తప్పక వేయించుకోవాలి

ABN , First Publish Date - 2021-03-02T05:09:34+05:30 IST

కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తున్న క్రమంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్‌ టీకా వేయించుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ అనిల్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

కొవిడ్‌ టీకా తప్పక వేయించుకోవాలి

ప్రొద్దుటూరు క్రైం, మార్చి 1 : కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తున్న క్రమంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్‌ టీకా వేయించుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ అనిల్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. సోమవారం కొవిడ్‌ వ్యాక్సిన్‌ అనుమతి పొందిన తేజ, లతాపాలి నర్సింగ్‌ హోం ప్రైవేట్‌ హాస్పిటల్‌ను ఆయన పరిశీలించి, అక్కడి వైద్యులతో వ్యాక్సిన్‌ వేసే అంశంపై చర్చించారు. బీపీ, షుగర్‌ లాంటి దీర్ఘకాలిక వ్యాధులున్న 50 సంవత్సరాలు పైబడిన వారు ఈ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో కొవిడ్‌ టీకా వేయించుకోవాలన్నారు. ఇదిలా ఉండగా, అంతకు ముందు  ఆరోగ్యమిత్రలతో డీఎంహెచ్‌వో సమావేశం నిర్వహించారు. 


Updated Date - 2021-03-02T05:09:34+05:30 IST