జిల్లాలో పకడ్బందీగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-10-26T05:30:00+05:30 IST

జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో వార్డుల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లతో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై వీడియో కాన్ఫరెన్స్‌లో ఆరా తీయగా.. జిల్లాలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ గురించి కలెక్టర్‌ నారాయణరెడ్డి వివరించారు.

జిల్లాలో పకడ్బందీగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 26: జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో వార్డుల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లతో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై వీడియో కాన్ఫరెన్స్‌లో ఆరా తీయగా.. జిల్లాలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ గురించి కలెక్టర్‌ నారాయణరెడ్డి వివరించారు. మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామ పంచాయతీలలో స్థానిక అధికారుల ద్వారా ప్రజలు వ్యాక్సినేషన్‌ తీసుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కొందరు వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో వారితో ప్రత్యేకంగా మాట్లాడి వ్యాక్సిన్‌ తీసుకునే విధంగా చూస్తున్నామన్నారు. బుధవారం నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలను కూడా భాగస్వాములను చేసి నిర్ణీత సమయంలో మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామన్నారు. సెకండ్‌ డోస్‌పై కూడా దృష్టి సారిస్తున్నామని కలెక్టర్‌ సీఎస్‌కు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు చిత్రమిశ్రా, చంద్రశేఖర్‌, జడ్పీ సీఈవో గోవింద్‌, ఇన్‌చార్జి డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ సుదర్శనం, డీపీవో జయసుధ తదితరులు పాల్గొన్నారు.

రేపు షెడ్యూల్‌ కులాలు, తెగల విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం

ఈనెల 27న కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో కలెక్టర్‌ నారాయణరెడ్డి అధ్యక్షతన షెడ్యూల్‌ కులాలు, తెగల (అత్యాచార నిరోదక చట్టం) విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి శశికళ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ సమావేశానికి జిల్లా అధికారులు హాజరుకావాలని ఆమె కోరారు.

Updated Date - 2021-10-26T05:30:00+05:30 IST