కమిషనర్ పగడాల జగన్నాథ్
ఎర్రగుంట్ల, జనవరి 16: కొవిడ్ నిబంధనలు నగరపంచాయతీలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ పగడాల జగన్నాథ్ పేర్కొన్నారు. కొవిడ్ థర్డ్‌వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలన్నారు. చేతులను తర చు సబ్బు, శానిటైజర్‌తోకాని శుభ్రం చేసుకోవాలన్నారు. అయితే ఎర్రగుంట్లలో చాలా మంది మాస్కులు ధరించకుండానే రోడ్లపై తిరుగు తున్నారు. సామాజిక దూరం పాటించకుండా గుంపులు గుంపులు తిరుగుతూ నిబంధనలు పాటించడంలేదు. అలాగే మద్యం షాపుల వద్ద, మటన్, చికెన్ సెంటర్ల వద్ద ఆదివారం తిరుణాళ్లగా కనిపించింది. నాలుగురోడ్ల వద్ద సమూహాలు అధికంగా ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.