Abn logo
May 5 2021 @ 23:39PM

కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలి

కమిషనర్‌ లవన్న

కడప(ఎర్రముక్కపల్లె),మే 5: కూరగాయల వ్యాపారులు కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని కమిషనర్‌ లవన్న పేర్కొన్నారు. కడప కార్పొరేషన్‌లో బుధవారం పాత కూరగాయల మార్కెట్‌, రైతు బజారు వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు బజారు వ్యాపారులు 50 శాతం మంది జడ్పీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మార్కెట్‌కు తరలిరావాలని సూచించారు. అలాగే పాత మార్కెట్‌ వ్యాపారులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వ్యాపారం చేయాలన్నారు. కార్యక్రమంలో కడప డీఎస్పీ సునీల్‌కుమార్‌, తహసీల్దారు శివరామిరెడ్డి, కార్పొరేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement