అనంతపురం వైద్యం, జనవరి 28: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 848 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతున్నవారిలో శుక్రవారం ఒకరు మృతి చెందారు. అనంతపురంలో అధికంగా 288 నమోదయ్యాయి. కదిరి 54, ధర్మవరం 44, గుంతకల్లు 42, ముదిగుబ్బ 36, పెద్దపప్పూరు 34, తాడిపత్రి 32, తనకల్లు 26, పు ట్టపర్తి 23, బుక్కపట్నం 19, పెనుకొండ 19, బత్తలపల్లి 18, కళ్యాణదుర్గం 17, బుక్క రాయసముద్రం 15, అమరాపురం 14, గుత్తి 14, వజ్రకరూరు 14, సీకేపల్లి 13, గార్లదిన్నె 12, పామిడి 12, మరికొన్ని మండలాల్లో పదికిలోగా కేసు లు నిర్ధారణ అయ్యాయి. ఇతర జిల్లాల వారు ఐదుగురు ఉన్నారు.