ఘనంగా కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి జయంతి

ABN , First Publish Date - 2022-08-17T05:47:53+05:30 IST

జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి 102 జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి జయంతి
కోట్ల చిత్రటానికి నివాళి అర్పిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

 కర్నూలు(అర్బన్‌), ఆగస్టు 16: జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి 102 జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ కమిటీ అఽధ్యక్షుడు సుధాకర్‌బాబు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అంతకముందు కోట్ల సర్కిల్‌లో కోట్ల కాంస్య విగ్రహానికి పూలమాలు వేశారు. ఈసందర్భంగా సుధాకర్‌ బాబు మాట్లాడుతూ రెండు సార్లు జడ్పీ చైర్మన్‌గా, ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి శాసన మండలి సభ్యులుగా, ఆరు సార్లు కర్నూలు లోక్‌ సభ సభ్యులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండు సార్లు ముఖ్య మంత్రిగా, నాలుగు సార్లు కేంద్ర మంత్రిగా సేవలు అందించిన ఘనత ఆయన దక్కిందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కె. పెద్దారెడ్డి, పీసీసీ అధికార ప్రతి నిధి కరుణాకర్‌ బాబు, దామోదరం రాజనరసింహ, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు బ్రతుకన్న, పొతుల శేఖర్‌, ప్రమీల, వెంకటలక్ష్మి, ఎల్లమ్మ పాల్గొన్నారు.

కోడుమూరు: జాతీయ స్థాయిలో మచ్చలేని మనిషిగా దివంగత కోట్ల విజయ భాస్కర్‌రెడ్డికి పేరు సంపాందించారని టీడీపీ మండల కన్వీనర్‌ కోట్ల కవితమ్మ అన్నారు. మంగళవారం స్థానిక కోట్ల సర్కిల్లోని ఆయన విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నివాళి  అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ కర్నూలు పార ్లమెంటు ఉపాధ్యక్షుడు కేఈ మల్లికార్జున గౌడ్‌, సర్పంచు భాగ్యరత్న, మాజీ సర్పంచు కేఈ రాంబాబు, సీబీలత, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు హేమాద్రి రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, టీఎన్‌టీయూసీ తాలుకా అధ్యక్షుడు గోపాల్‌నాయుడు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎల్లప్పనాయుడు, తిరుమల్‌నాయుడు పాల్గొన్నారు. 

గూడూరు:
మచ్చలేని నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్‌రెడ్డియని పట్టణ టీడీపీ అధ్యక్షుడు గజేంద్ర గోపాల్‌ నాయుడు అన్నారు. మంగళవారం గూడూరు పట్టణంలో కోట్ల జయంతిని పురస్కరిం చుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అలాగే గూడూరు పట్టణంలో కోట్ల విజయ భాస్కర రెడ్డి చిత్రపటానికి టీడీపీ కర్నూలు పార్లమెంట్‌ తెలుగు యువత  కార్యదర్శి చరణ్‌ కుమార్‌ పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మన్నన్‌బాషా, నాగప్ప యాదవ్‌, సులేమాన్‌, వడ్డే నాగేష్‌, వై నాగరాజు, మధుసుదన్‌, గోవిందు, మూలగేరి లక్ష్మన్న, చెట్టుకింది నారాయణ, కిశోర్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-17T05:47:53+05:30 IST