కొత్తపల్లి జలపాతం వద్ద అలహాబాద్ హైకోర్టు జడ్జి సరోజని యాదవ్ దంపతులు
సందర్శించిన అలహాబాద్ హైకోర్టు జడ్జి సరోజిని యాదవ్
దంపతులు, అనకాపల్లి జడ్జి ఉమాదేవి
జి.మాడుగుల, మే 17: ప్రముఖ పర్యాటక కేంద్రం కొత్తపల్లి జలపాతాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అలహాబాద్ హైకోర్టు జడ్జి సరోజని యాదవ్ దంపతులు, అనకాపల్లి జడ్జి ఉమాదేవి మంగళవారం వేర్వేరుగా సందర్శించారు. కొత్తపల్లి జలపాతం అందాలను తిలకించి ఆస్వాదించారు. పాడేరు మోదకొండమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం వారు ఇక్కడికి వచ్చారు. కొంతసేపు ఆహ్లాదంగా గడిపారు. ఇక్కడ మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే ఈ పర్యాటక ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఏకో టూరిజం సభ్యులు వి.అభి, వి.రాజు, వి.రమణ, కె.నాగు, వి.జానీ, సూరిబాబులకు వారు సూచించారు.