Abn logo
Apr 20 2021 @ 16:54PM

సీనియర్ జర్నలిస్ట్ అమర్‌నాథ్ మృతిపట్ల దాసోజు సంతాపం

హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్ అమర్‌నాథ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ సంతాపం తెలిపారు. నిమ్స్‌లో తుదిశ్వాస విడిచారని ట్వీట్ చేసిన దాసోజు.. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అమర్‌నాథ్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అమర్‌నాథ్ పాత్రను మరువలేమని పేర్కొన్నారు.  


Advertisement