దళితుల ఉద్ధరణ కోసమే దళితబంధు: కొప్పుల ఈశ్వర్‌

ABN , First Publish Date - 2021-08-16T23:46:13+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో దళితుల ఉద్దరణ కోసమే దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు.

దళితుల ఉద్ధరణ కోసమే దళితబంధు: కొప్పుల ఈశ్వర్‌

హుజూరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో దళితుల ఉద్దరణ కోసమే దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం శాలపల్లి-ఇందిరానగర్‌లో దళితబంధు పథకాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అనేక కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ పథకాలతో సీఎం ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. తరతరాలుగా దళితులు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోయారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని దళితుల జీవితాల్లో వెలుగు నింపాలనే ఉదేశ్యంతో దళితబంధు పథకాన్ని ఫైలట్‌ ప్రాజెక్టు కింద హుజూరాబాద్‌లో ప్రవేశపెట్టారని కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు.

Updated Date - 2021-08-16T23:46:13+05:30 IST