కొండేపూడి స్కూల్‌ను వేండ్ర హైస్కూల్లో కలపొద్దు

ABN , First Publish Date - 2022-07-03T07:35:04+05:30 IST

కొండేపూడి గ్రామ యూపీ స్కూల్‌ని వేండ్ర హైస్కూల్లో కలపవద్దని కొండేపూడి మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల తల్లిదండ్రుల కమిటీ కోరింది.

కొండేపూడి స్కూల్‌ను వేండ్ర హైస్కూల్లో కలపొద్దు
కొండేపూడిలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, విద్యార్థులు

పాలకోడేరు, జూలై 2 : కొండేపూడి గ్రామ యూపీ స్కూల్‌ని వేండ్ర హైస్కూల్లో కలపవద్దని కొండేపూడి మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల తల్లిదండ్రుల కమిటీ కోరింది. శనివారం పాఠశాల ముందు ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండేపూడి ప్రాథమికోన్నత పాఠశాల నందు ఒకటి నుంచి ఏడో తరగతి చదువుతున్న వారిని మెర్జింగ్‌లో భాగంగా 6,7 తరగతులను వేండ్ర జడ్పీ పాఠశాలలో కలపడం వల్ల కొండేపూడి విద్యార్థు లు మూడు కిలోమీటర్లు పైబడి మెయిన్‌రోడ్‌ వెంబడి కాల్వపక్కన నుంచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని  తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కొండేపూడిలోనే పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని తీర్మానించామన్నారు.

Updated Date - 2022-07-03T07:35:04+05:30 IST