Abn logo
Apr 8 2021 @ 23:44PM

కొండరెడ్ల జీవన విధానంపై సర్వే చేయాలి

అధికారులకు గవర్నర్‌ సంయుక్త కార్యదర్శి భవానీ శంకర్‌ ఆదేశం

అశ్వారావుపేట, ఏప్రిల్‌ 8: అశ్వారావుపేట మండలంలోని గోగులపూడిలో నివసించే కొండరెడ్ల జీవన విఽధానం, పోషకాహార విలువలపై సర్వే చేయాలని గవర్నర్‌ సంయుక్త క్యారదర్శి భవాని శంకర్‌ అధికారులను ఆదేశించారు. గురువారం అశ్వారావుపేట తహసీల్దార్‌ కార్యాలయంలో గవర్నర్‌ పేషీ అధికారులు, ఐసీఎంఆర్‌- జాతీయ పోషకాహార సంస్ధ, హైదరాబాదులో బాగంగా స్థానిక అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పై గ్రామంలోని కొండరెడ్లకు సంబంధించిన పూర్తి వివరాలు, పోషకాహార లోపం, ఇతర జీవన విధానంపై సర్వే చేసేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. సర్వే నమూనా కాపీలను కూడా ఆ బృందాల అందజేశారు. సమావేశంలో  ఈఎస్‌ఐ మెడికల్‌ కాలేజి, హైదరాబాదు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు  డా. హరికృష్ణ, డా. రంజిత్‌కుమార్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆప్‌ న్యూట్రీషియన్‌ రీసెర్చ్‌ స్కాలర్‌ శివుడు పాల్గొన్నారు.

Advertisement
Advertisement