Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 07 Dec 2021 11:55:30 IST

HYD: కొండాపూర్ ఫ్లైఓవర్ వద్ద కారుపై పడ్డ ఇనుప రాడ్డు.. తప్పిన పెను ప్రమాదం

twitter-iconwatsapp-iconfb-icon
HYD: కొండాపూర్ ఫ్లైఓవర్ వద్ద కారుపై పడ్డ ఇనుప రాడ్డు.. తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న కొండాపూర్ ఫ్లైఓవర్ వద్ద పెను ప్రమాదం తప్పింది. ఫ్లైఓవర్ నిర్మాణంలో నిర్లక్ష్యం బయటపడింది. మంగళవారం ఉదయం కొండాపూర్ నుంచి మియాపూర్‌కు వెళుతున్న ఓ కారుపై ఫ్లైఓవర్ నిర్మాణానికి ఉపయోగించే రాడ్డు పడింది. ఈఘటనలో కారు పాక్షికంగా ధ్వంసమవగా... అందులో ఉన్న వారు సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ ఫ్లైఓవర్ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించటం ఏమిటని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారు యజమాని మీడియాతో మాట్లాడుతూ... తాను కొండాపూర్ నుంచి వస్తున్న సమయంలో ప్లైఓవర్ పై నుంచి పెద్ద రాడ్డు తన కారుపై పడిందని, దీంతో కారు చాలా డామేజ్ అయిందని  తెలిపారు. ఒకవేళ ఇదే రాడ్ ద్విచక్రవాహనంపై పడి ఉంటే పెను ప్రమాదం జరిగేదన్నారు. ప్లైఓవర్ నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కారు యజమాని సత్య ప్రవీణ్ డిమాండ్ చేశారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.