కోణంగిపల్లెలో కోడెగిత్తల జోరు

ABN , First Publish Date - 2022-02-28T07:14:07+05:30 IST

వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం పంచాయతీ కోణంగిపల్లెలో ఆదివారం జల్లికట్టు జరిగింది. గిత్తలను నిలువరించే యువకులు, జనం ముందుగా నిర్ధేశించిన అల్లిలో నిలబడ్డారు.

కోణంగిపల్లెలో కోడెగిత్తల జోరు

వెదురుకుప్పం : వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం పంచాయతీ కోణంగిపల్లెలో ఆదివారం జల్లికట్టు జరిగింది. గిత్తలను నిలువరించే యువకులు, జనం ముందుగా నిర్ధేశించిన అల్లిలో నిలబడ్డారు. జనం మాత్రం గోడలు, మేడలు ఎక్కారు.  కోడెగిత్తల కొమ్ములకు పలువురు నాయకులు, దేవుళ్ల ఫొటోలున్న పట్టీలను కట్టి అల్లివైపు వదిలారు. యువకులు ఉత్సాహంతో గిత్తలను నిలువరించి పట్టీలు దక్కించుకున్నారు. ఈ క్రమంలో కొందరికి స్వల్పగాయాలయ్యాయి.

Updated Date - 2022-02-28T07:14:07+05:30 IST