కొండపైకి కోదండరామయ్య

ABN , First Publish Date - 2022-04-23T05:41:17+05:30 IST

రామతీర్ధంలో కోదండ రామస్వామి కొత్త ఆలయంలోకి ప్రవేశించనున్నారు. రాతితో నిర్మించిన నూతన ఆలయం పనులు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 7.37 గంటలకు ఆలయ ప్రారంభోత్సవానికి వేదపండితులు ముహూర్తం ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి పునఃప్రతిష్ట పూజలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రారంభోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ హాజరుకానున్నారు.

కొండపైకి కోదండరామయ్య
ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న దృశ్యం

రాతి కట్టడంతో ముస్తాబైన ఆలయం 

25న ప్రారంభోత్సవం 

ఏర్పాట్లు చేస్తున్న దేవదాయ శాఖ

 నెల్లిమర్ల, ఏప్రిల్‌ 22: రామతీర్ధంలో కోదండ రామస్వామి కొత్త ఆలయంలోకి ప్రవేశించనున్నారు.  రాతితో నిర్మించిన నూతన ఆలయం పనులు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 7.37 గంటలకు ఆలయ ప్రారంభోత్సవానికి వేదపండితులు ముహూర్తం ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి పునఃప్రతిష్ట పూజలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రారంభోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ హాజరుకానున్నారు. అయితే ఆలయం మినహా మిగతా పనులు చాలావరకూ పెండింగ్‌లోనే ఉన్నాయి. కొండమీదకు వెళ్లేందుకు మెట్ల నిర్మాణం, యాగాలు, హోమాలు నిర్వహించేందుకు వీలుగా హోమశాల ఏర్పాటు, కోనేరు సుందరీకరణ వంటి పనులు ఇంకా పూర్తికాలేదు. ఆలయ ప్రతిష్ట తరువాత మిగులు దశలవారీగా పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. 16 మంది వేదపండితుల పర్యవేక్షణలో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవస్థానం ఈవో డీవీవీ ప్రసాదరావు తెలిపారు. భక్తులకు ఇబ్బందుల కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. 

 రూ.3 కోట్లతో ఆలయ నిర్మాణం

 నీలాచలం కొండపై ఉన్న పురాతన కోదండరాముని ఆలయంలో సీతారాముల విగ్రహాలను 16 నెలల కిందట గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. దేవాలయాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపఽథ్యంలో కొదండరాముని ఆలయాన్ని కొత్తగా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు నిధులు కేటాయించింది. నీలాచలం కొండపై పూర్తిగా రాతి కట్టడాలతో ఆలయాన్ని నిర్మించారు. టీటీడీ శిల్ప కళాకారుల తయారు చేసిన సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను ఇదివరకే  రామతీర్ధం తీసుకువచ్చి దేవాలయం దిగువననున్న బాలలయంలో ఆగమశాస్త్రం ప్రకారం ప్రతిష్టించారు. నిత్య పూజలు జరుపుతున్నారు. కొండపై ఆలయ నిర్మాణ పనులు పూర్తికావడంతో అక్కడ పున: ప్రతిష్ఠించనున్నారు. 




Updated Date - 2022-04-23T05:41:17+05:30 IST