వ్యక్తిగత పరిశుభ్రతతోనే కరోనా నివారణ

ABN , First Publish Date - 2020-04-04T09:06:27+05:30 IST

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి సారించి, భౌతిక దూరం పాటిస్తే కరోనాను అడ్డుకోగలమని మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) అన్నారు.

వ్యక్తిగత పరిశుభ్రతతోనే కరోనా నివారణ

మంత్రి కొడాలి నాని


గుడివాడ, ఏప్రిల్‌ 3: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి సారించి, భౌతిక దూరం పాటిస్తే కరోనాను అడ్డుకోగలమని మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) అన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం కరోనా నియంత్రణ చర్యలపై మున్సిపల్‌ అధికారులతో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ, ప్రజల్లో మార్పు రాకపోతే వచ్చే 60 రోజులు కూడా ఇవే పరిస్థితులు ఉంటాయన్నారు.


గుడివాడలోని ప్రధాన ప్రాంతాల్లో శానిటేషన్‌ చేయాలని సూచించారు. కమిషనర్‌ సంపత్‌కుమార్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ రంగారావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. రూ.30 వేలు విలువ చేసే రీయూజబుల్‌, వాషబుల్‌, బ్రీతబుల్‌ సౌకర్యాలు ఉన్న మాస్క్‌లు అందజేసిన తానా ఫౌండేషన్‌ ట్రస్టీ యార్లగడ్డ వెంకటరమణ అభినందనీయులని మంత్రి ప్రశంసించారు. 

Updated Date - 2020-04-04T09:06:27+05:30 IST