ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

ABN , First Publish Date - 2020-11-01T11:39:42+05:30 IST

దొంగతనం కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్‌ చేశారు. నంద్యాల రూరల్‌ సీఐ మల్లికార్జున శనివారం మహానంది పోలీస్‌స్టేషన్‌లో వివరాలను విలేకరులకు వెల్లడించారు.

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

మహానంది, అక్టోబరు 31: దొంగతనం కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్‌ చేశారు. నంద్యాల రూరల్‌ సీఐ మల్లికార్జున శనివారం మహానంది పోలీస్‌స్టేషన్‌లో వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈనెల 23 న అర్ధరాత్రి మహానంది మండలం గాజులపల్లి మెట్ట పరిధిలో ఉన్న దీప్తి ఎరువుల దుకాణంలో ఇద్దరు వ్యక్తులు షట్టర్‌ తలుపులను పగల గొట్టి షాపులోని రూ. 15 వేలను దొంగలించారు. మహానంది పోలీసులు దుకాణంలోని సీసీ పుటేజీలతో పాటు ప్రధాన వీధిలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీల్లో దొంగతనానికి పాల్పడింది అంతర్రాష్ట్ర దొంగలు అని నిర్ధారించుకున్నారు. ఆరాత్రి ఎరువుల దుకాణం పరిసరాల్లో ఒక ఆటో పలుమార్లు తిరిగినట్లు గుర్తించారు. ఆటో నెంబర్‌ ఆధారంగా పోలీసులు చాకచక్యంగా వ్యవహారించి దొంగతనానికి పాల్పడ్డ రుద్రవరం మండలం పందిర్లపల్లి గ్రామానికి చెందిన మల్లేష్‌ అలియాస్‌ శివతో పాటు అదే మండలం కోటకొండ గ్రామానికి చెందిన నాగేశ్‌గా గుర్తించారు. ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను శుక్రవారం సాయంత్రం గాజులపల్లి సమీపంలోని పద్మశివ డాభా పరిసరాల్లో తిరుగుతుండగా అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.


15వేల నగదుతో పాటు దొంగతనానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు. గతంలోమల్లేష్‌ కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరంతో పాటు రాష్ట్రంలోని పలు పట్టణాల్లో దుకాణాల షట్టర్లను పెకలించి పలు దొంగతనాలు చేసినట్లు తెలిసింది. కర్ణాటక పోలీసుల నుంచి తప్పించుకొనేందుకు తిరిగి స్వగ్రామం వచ్చాడు. చేరి కోటకొండకు చెందిన నాగేష్‌తో కలిసి గాజులపల్లి మెట్ట వద్ద ఉన్న ఎరువుల దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డాడు. వీరిని కోర్టులో హాజరు పరిచారు. మహానంది పోలీసులు సహాద్రి, శేషన్న, కైలాష్‌, చంద్రశేఖర్‌కు సీఐ మల్లికార్జున, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నగదు రివార్డులను అందచేసి అభినందించారు. 

Updated Date - 2020-11-01T11:39:42+05:30 IST