Abn logo
Oct 27 2020 @ 05:21AM

రామిరెడ్డిని అరెస్టు చేయాలి: కేవీపీఎస్‌

కర్నూలు(న్యూసిటీ), అక్టోబరు 26: బండిఆత్మకూరు మండలం సంతజూటూరులోని పరమటూరు కోఆపరేటివ్‌ సొసైటీ బ్యాంకు రోజూ కూలీ జయప్రకాష్‌ చావుకు కారణమైన రామిరెడ్డిని అరెస్టు చేయాలని కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఆనంద్‌బాబు డిమాండ్‌ చేశారు. ఆదివారం కలెక్టరేట్‌ ఎదుట జయప్రకాష్‌ మృతదేహంతో ధర్నా నిర్వహించారు. దళితుడైన జయప్రకా్‌షను అనేక రకాలుగా వేధింపులకు గురి చేసి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన రామిరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు పెద్దబాబు, విజయమ్మయ, చంద్రశేఖర్‌, మృతుని భార్య భాగ్యలక్ష్మి బంధువులు దొరస్వామి, క్రాంతి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement