గోడ దూకి.. బడికి..!

ABN , First Publish Date - 2020-10-01T08:49:19+05:30 IST

బడి ఎగ్గొట్టేందుకు విద్యార్థులు గోడ దూకేవారు. కానీ గడివేములలో బడికి వెళ్లాలంటే గోడ దూకాల్సి వస్తోంది. విద్యార్థులు మాత్రమే కాదు.. ఉపాధ్యాయులు కూడా గోడ దూకే బడికి పోతున్నారు.

గోడ దూకి.. బడికి..!

గడివేముల,  సెప్టెంబరు 30: బడి ఎగ్గొట్టేందుకు విద్యార్థులు గోడ దూకేవారు. కానీ గడివేములలో బడికి వెళ్లాలంటే గోడ దూకాల్సి వస్తోంది. విద్యార్థులు మాత్రమే కాదు.. ఉపాధ్యాయులు కూడా గోడ దూకే బడికి పోతున్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థులు ఉన్నారు.


కొవిడ్‌ కారణంగా ప్రస్తుతం 9, 10 తరగతుల విద్యార్థులు సందేహాల నివృత్తి కోసం బడికి వెళుతున్నారు. భారీ వర్షాల వల్ల మురుగు కాలువలు ఉప్పొంగాయి. ఈ నీరు మొత్తం పాఠశాల ప్రధాన ద్వారం వద్ద నిలిచింది. కాలు పెట్టే పరిస్థితి లేదు. చిన్న గేటు వద్ద మురుగునీటి కాలువ అడ్డుగా ఉంది. దీంతో విద్యార్థులు పక్కనే ఉన్న ప్రహరీని దాటుకుని వెళుతున్నారు. బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.  

Updated Date - 2020-10-01T08:49:19+05:30 IST