భారీ వర్షం

ABN , First Publish Date - 2020-10-01T08:52:33+05:30 IST

కొలిమిగుండ్ల, నాయునిపల్లె, పెట్నికోట గ్రామాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. పొలాల్లోని వర్షపునీరంతా కొలిమిగుండ్లలోకి ప్రవేశించడంతో సంతవీధి, శివాలయం వీధి, డాక్టర్‌ గుర్రన్న వీధి వీధులు వాగులను తలపించాయి.

భారీ వర్షం

కొలిమిగుండ్ల, సెప్టెంబరు 30: కొలిమిగుండ్ల, నాయునిపల్లె, పెట్నికోట గ్రామాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. పొలాల్లోని వర్షపునీరంతా కొలిమిగుండ్లలోకి ప్రవేశించడంతో సంతవీధి, శివాలయం వీధి, డాక్టర్‌ గుర్రన్న వీధి వీధులు వాగులను తలపించాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో వర్షపునీరంతా ప్రధాన రహదారిపై ప్రవహిస్తోంది. శాంతినగర్‌లో డీలరు చెన్నారెడ్డి చౌక దుకాణంలోకి నీరు చేరడంతో బియ్యం, కందిబేడలు తడిసిపోయాయి. శివాలయం వీఽధిలో పెద్దయ్య గృహంలోకి వర్షపునీరు ప్రవేశించడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

 

కోవెలకుంట్ల: కోవెలకుంట్ల పట్టణంలో కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో వరదనీరు కాలనీల్లో ప్రవహించింది. పట్టణంలోని మెయిన్‌ బజారు, స్టేట్‌బ్యాంకు రోడ్డు, సంతపేట కాలనీల్లో మోకాలి లోతులో నీరు ప్రవహించింది. అంతే కాకుండా మండలంలోని చిన్నకొప్పెర్ల, పెద్దకొప్పెర్ల, వల్లంపాడు, లింగాల గ్రామాల మధ్య ఉన్న వాగులు పొంగి ప్రవహించాయి. దీంతో ఈ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్టాండు ప్రాంగణం నీటితో నిండిపోయింది. ఈ వరద నీరు కుందూలో చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. 

 

కొనసాగుతున్న కుందూ వరద ఉధృతి

చాగలమర్రి: మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాజోలి ఆనకట్ట వద్ద కుందూ వరద ఉధృతి కొనసాగుతోంది. బుధవారం భారీ వర్షంతో రాజోలి ఆనకట్ట వద్ద 20,600 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నట్లు కేసీకెనాల్‌ ఏఈ మురళీకృష్ణ తెలిపారు. 20 వేల క్యూసెక్కుల నీటిని ఆనకట్ట వద్ద గేట్లను ఎత్తి కడప జిల్లావైపుకు విడుదల చేశామని అన్నారు.  


ఇండ్లలోకి  చేరిన వర్షపు నీరు.

పగిడ్యాల: గతకొద్ది రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గ్రామలు జలమయమౌతున్నాయి.  వర్షాలకు రోడ్లుపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు  ఇబ్బందిగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. పలు గ్రామాల్లోని  కాలనీల్లో రోడ్ల జలమయం కావడంతో పాటు ఇండ్లలోకి నీరు రావడంతో ఇబ్బందులు పడాల్సివస్తుంది. వర్షాలకు రైతులు సాగు చేసిన మొక్కజొన్న, ప్రత్తి, మిరప పంటల్లో వర్షపు నీరు నిలవడంతో దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2020-10-01T08:52:33+05:30 IST