లక్షణాలతో పరీక్షలకు వెళ్తుంటే..

ABN , First Publish Date - 2020-08-06T09:49:59+05:30 IST

లక్షణాలతో పరీక్షలకు వెళ్తుంటే..

లక్షణాలతో పరీక్షలకు వెళ్తుంటే..

చేతిలో పాజిటివ్‌ రిపోర్టు..!

 కొత్త కేసులు 1,544, యాక్టివ్‌ కేసులు 19,496

వారంరోజులుగా వెల్లడవుతున్న ఫలితాల్లో ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులే అధికం

ఇప్పటికే వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆయా శాఖల ఉద్యోగులకు కొవిడ్‌ చికిత్స


కాకినాడ,ఆంధ్రజ్యోతి: వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, రెవెన్యూ ఉద్యోగులు కొవిడ్‌ నియంత్రణలో వారియర్స్‌గా ముద్రపడ్డారు. వీరిలో కొంతమందికి కరోనా సోకడం, పరిస్థితి విషమించి మృతి చెందడం కూడా జరిగింది. తాజాగా నాన్‌వారియర్స్‌ కూడా కొవిడ్‌ బారిన పడుతున్నారు. వీరంతా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు. ప్రస్తుతం కొవిడ్‌ సోకిన ఇతర శాఖల ఉద్యోగులు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారంరోజులనుంచి వస్తున్న పాజిటివ్‌ ఫలితాలను గమనిస్తే ఉద్యోగుల కుటుంబ సభ్యులకు రుగ్మత సోకుతున్నట్టు తెలుస్తోంది. అనుమా నంతో శ్వాబ్‌ పరీక్షలు చేయించుకోడానికి ఆస్పత్రులకు వెళ్తుంటే రెండు, మూడు రోజుల తర్వాత వీరి చేతిలో వైద్యులు పాజిటివ్‌ రిపోర్టు పెడుతున్నారు. కాకినాడలో ఓ సంక్షేమశాఖలో పనిచేస్తున్న ఉద్యోగికి ఇటీవల కొవిడ్‌ సోకింది. అతడు కోనసీమలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికి త్స పొందుతున్నాడు. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యు లు బెంబేలెత్తితున్నారు. పరీక్షలు చేయించుకోడానికి భ యపడుతున్నారని తెలిసింది. కానీ ధైర్యంచేసి పరీక్షలకు సిద్ధమయ్యారని సమాచారం. ఈనెల 4న జిల్లావ్యాప్తంగా చేసిన కొవిడ్‌ పరీక్షల్లో 1,544 మందికి వైరస్‌ సోకింది. దీంతో ఈ సంఖ్య 26,229 కి చేరింది. యాక్టివ్‌లో 19,496 మంది ఉన్నారు. షరా మాములుగానే కాకినాడ అర్బన్‌ మండలంలో 344, రాజమహేంద్రవరం అర్బన్‌లో 284 కేసులు వెలుగు చూశాయి. 


ప్రాంతాలవారీ కేసులు ఇలా..

అడ్డతీగల 13, అయినవిల్లి 2, ఆలమూరులో 12, అల్లవరంలో 7, అమలాపురంలో 65, అంబాజీపేటలో 23, అనపర్తిలో 10, బిక్కవోలులో 6, చింతూరులో 1, దేవీపట్నంలో 10, గండేపల్లిలో 4, గంగవరంలో 5, గోకవరంలో 26, గొల్లప్రోలు 16, ఐ పోలవరంలో 3, జగ్గంపేట 21, కడియం 1, కాజులూరు 4, కాకినాడ రూరల్‌ 45, కపిలేశ్వరపురం 1, కరప 1, కాట్రేనికోన 15, కిర్లంపూడి 28, కోరుకొండ 22, కోటనందూరు 3, కొత్తపల్లి 14, కొత్తపేట 13, మలికిపురం 10, మామిడికుదురు 27, మండ పేట 32, మారేడిమిల్లి 2, ముమ్మిడివరం 6, పి.గన్నవరం 4, పామర్రు 15, పెదపూడి 14, పెద్దాపురం 37, పిఠాపురం 28, ప్రత్తిపాడు 4, రాజమహేంద్రవరం రూరల్‌ 60, రాజానగరం 52, రాజవొమ్మంగి 3, రామచంద్రాపురం 12, రంపచోడవరం 10, రంగంపేట 1, రాయవరం 10, రాజోలు 18, రౌతులపూడి 1, సఖినేటిపల్లి 1, సామర్లకోట 61, శంఖవరం 24, సీతానగరం 5, తాళ్లరేవు 19, తొండంగి 18, తుని 43, ఉప్పలగుప్తం 4, వై.రామవరం 2, ఏలేశ్వరం 21, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు 1.


కొవిడ్‌తో ముగ్గురి మృతి

అమలాపురం టౌన్‌/కపిలేశ్వరపురం, ఆగస్టు 5: కిమ్స్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు బుధ వారం మృతిచెందారు. వీరిలో వీరవల్లిపాలేనికి చెందిన 69ఏళ్ల వృద్ధుడు, కాకినాడ రూరల్‌ మండలానికి చెందిన 59ఏళ్ల వ్యక్తి మృతిచెందినట్టు అధికారికంగా ప్రకటించా రు. పాజిటివ్‌ వచ్చిన 60 మంది ఆసుపత్రిలో చేరగా 35 మంది డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 437 మంది చికిత్స పొందుతున్నారు. కపిలేశ్వరపురం మండలంలోను పాజిటివ్‌తో ఆందోళనకు గురై చేనేత కార్మికుడు మృతి చెందాడు. టేకి వీవర్స్‌కాలనీలో ఉంటున్న 55ఏళ్ల చేనేత కార్మికుడికి వాకతిప్ప పీహెచ్‌సీలో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆందోళనకు గురైన అతడు మంగళవారం రాత్రి మృతి చెందాడు.

Updated Date - 2020-08-06T09:49:59+05:30 IST