వైఎస్‌ఆర్‌ చేయూతకు 2.12 లక్షల దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-08-06T09:50:56+05:30 IST

వైఎస్‌ఆర్‌ చేయూతకు 2.12 లక్షల దరఖాస్తులు

వైఎస్‌ఆర్‌ చేయూతకు 2.12 లక్షల దరఖాస్తులు

కాకినాడ(డెయిరీఫారమ్‌ సెంటర్‌), ఆగస్టు 5: జిల్లాలో వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి 2.12లక్షల దరఖాస్తులు అందాయి. ఈ పథకం దరఖా స్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగిసింది. దీనిద్వారా 45ఏళ్ల నుంచి 60ఏళ్లలోపు వయసుగల డ్వాక్రా మహిళలకు ఆర్థిక చేయూత అందించనున్నారు. అర్హులకు ఏటా రూ.18,750 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. గడువు ముగిసే సమయానికి 2.12లక్షల దరఖాస్తులు వచ్చాయని డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథరావు తెలిపారు.


జర్నలిస్ట్‌లకు కొవిడ్‌ వైద్యంకోసం కోఆర్డినేటర్‌ల నియామకం

కాకినాడ(ఆంధ్రజ్యోతి), ఆగస్టు 5: జిల్లాలో జర్నలిస్ట్‌లకు కొవిడ్‌-19 వైరస్‌ వైద్యసహా యం కోసం జిల్లాస్థాయిలో నోడల్‌ అధికారులను నియమిస్తూ కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి బుధవారం ఉత్త ర్వులు జారీ చేశారు. ఈ విపత్తు బారినుంచి తప్పించుకోడానికి ప్రజల ను చైతన్యం చేస్తున్న వీరికి కరోనా సోకితే సత్వర వైద్య సహాయం అందించడానికి వైద్య,ఆరోగ్యశాఖనుంచి డిస్ర్టిక్ట్‌ కో ఆర్డినేటర్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌(డీసీహెచ్‌ఎస్‌) డాక్టర్‌ టి.రమేష్‌కిశోర్‌ను నియమించారు. సమా చార, పౌరసంబంధాలశాఖ నుంచి కాకినాడ ఏపీఆర్‌వో మహ్మద్‌ విలాయత్‌ అలీని నియమించా రు. వీరిద్దరూ పాజిటివ్‌ సోకిన జర్నలిస్టులకు జిల్లాలో కొవిడ్‌ ఆస్పత్రుల్లో ఎక్కడ వీలైతే అక్కడ చేర్చి వైద్యం అందించేందుకు కృషి చేస్తారని కలెక్టర్‌ తెలిపారు. డీసీహెచ్‌ఎస్‌ను 8008553430, ఏపీఆర్‌వోను 9121215272 నెంబర్లలో బాధిత జర్నలిస్ట్‌లు సందప్రదించవచ్చన్నారు. 


జిల్లాలో వర్షపాతం వివరాలు

కాకినాడ(డెయిరీఫారమ్‌ సెంటర్‌), ఆగస్టు 5: జిల్లాలో గడచిన 24గంటల్లో 4.4మిలీమీటర్ల సరాసరితో మొత్తం 284.5మి.మీ. వర్షం కురిసింది. అత్యధికంగా కరప మండ లంలో 30.2 మి.మీ. వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా రామచంద్రపురం మండలంలో 0.4 మి.మీ వర్షపాతం నమోదైంది. వరరామచంద్రపురంలో 24.4, మారేడుమిల్లిలో 17.6, ఏలేశ్వరంలో 16.6, గంగవరంలో 11.6, అడ్డతీగలలో 11.2, రంపచోడవరంలో 10.6, పామర్రులో 10.2, చింతూరులో 10.2, సఖినేటిపల్లిలో 10.0 మి.మీ. వర్షం కురిసింది.

Updated Date - 2020-08-06T09:50:56+05:30 IST