కరోనా కంట్రోల్‌ రూమ్‌

ABN , First Publish Date - 2020-03-27T06:37:18+05:30 IST

కేంద్రం ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీని బట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలని..

కరోనా కంట్రోల్‌ రూమ్‌

  • జాతీయ స్థాయిలో ఏర్పాటు
  • ఇన్‌చార్జిగా మంత్రి కిషన్‌ రెడ్డి
  • రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం
  • ప్యాకేజీని చూసైనా తీవ్రతను అర్థం చేసుకోండి
  • లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయండి
  • ఎవరూ ఇళ్లలోంచి బయటకు రాకండి
  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మార్చి 26(ఆంధ్రజ్యోతి): కేంద్రం ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీని బట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కోరారు. కరోనాపై పోరుకు కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిందన్నారు. దీనివల్ల దాదాపు 80 కోట్ల మంది ప్రజలకు ల బ్ధి చేకూరుతుందని చెప్పారు. ప్రాణాలకు తెగించి కరోనాపై పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి రూ.50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించిన ట్లు తెలిపారు. బీజేపీ, ఇతర పార్టీల కార్యకర్తలు, స్వ చ్ఛంద సంస్థల ప్రతినిధులు మానవత్వంతో ప్రతి రో జూ అయిదుగురికి భోజనం అందించాలని పిలుపునిచ్చారు. మనల్ని చూసి కరోనా భయపడి పారిపోయే లా వ్యవహరించాలని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. ఎమర్జెన్సీ విధులు నిర్వహించే వారు తప్ప మిగిలినవారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి బయటికి రావద్దని కోరారు. 


గురువారం కిషన్‌రెడ్డి ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా మాట్లాడారు. అలాగే, ఢిల్లీలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో చిక్కుకున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఇరు రాష్ట్రాల అధికారులను ఆదేశించారు. ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం లేక సరిహద్దుల్లో వేలాది మంది ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి పరిస్థితులు మంచిది కాదని సూచించారు. మహారాష్ట్ర నుంచి పొలాల మీదుగా పౌరులు నడిచి వస్తున్నట్లు తెలిసిందని, ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలందరికీ నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతు లు నమ్మొద్దని, మూఢనమ్మకాలను విశ్వసించవద్దని పిలుపునిచ్చారు. 


అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన అమెరికాయే కరోనాను తట్టుకోలేకపోతోందని, ఆ పరిస్థితి మన దేశంలో రాకూడదని, అందుకు అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కష్టమైనప్పటికీ ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ను ప్రకటించారని గుర్తు చేశారు. ప్రజలు వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సమన్వయం చేస్తుందన్నారు. ఈ బాధ్యతను కేంద్ర హోం శాఖ తీసుకుందని వెల్లడించారు. కేంద్రం ఎప్పటికప్పుడు మందులు, వైద్య పరికరాలను రాష్ట్రాలకు అందిస్తోందని చెప్పారు.

  

ఎక్కడివారక్కడే ఉండాలి

వారణాసితో పాటు ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్నామని, స్వగ్రామాలకు వెళ్లడానికి సహకరించాలని కొం దరు తెలుగువారు కోరుతున్నారని.. వారంతా ఎక్కడివారక్కడే ఉండాలని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎక్క డున్నా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తాను అక్కడి అధికారులతో మాట్లాడి వసతి సౌకర్యాలు ఏ ర్పాటు చేశానని వెల్లడించారు. కేంద్ర హోంశాఖ కార్యాలయంలో కంట్రోల్‌ రూ మ్‌ను పర్యవేక్షిస్తున్నందున తెలుగు రాష్ట్రాల్లో పర్యటించలేకపోతున్నానన్నారు. 

Updated Date - 2020-03-27T06:37:18+05:30 IST