వారి తప్పిదాల వల్లే చిన్నారులు అర్హత కోల్పోయారు.. Kishan Reddy

ABN , First Publish Date - 2022-05-30T01:27:18+05:30 IST

Telangana: తెలంగాణ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా మంది పిల్లలు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకానికి అర్హత కోల్పోయారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

వారి తప్పిదాల వల్లే చిన్నారులు అర్హత కోల్పోయారు.. Kishan Reddy

Telangana: తెలంగాణ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా మంది పిల్లలు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకానికి అర్హత కోల్పోయారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కరోనాలో ఎంతమంది చనిపోయారో నిర్ధారించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని తెలిపారు. కిషన్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ.. కేంద్రం ఇవ్వాల్సినవన్నీ రాష్ట్రానికి ఇస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రూల్డ్ అవుట్ అయ్యిందని, ఉక్కుఫ్యాక్టరీ పెడితే నష్టాలే తప్ప లాభాలుండవన్నారు. పోలవరం ప్రాజెక్టు విభజన చట్టంలో ఉన్నందున కేంద్రం నిధులిచ్చిందని చెప్పారు. ఏయిమ్స్ వైద్య కళాశాల మంజూరు చేస్తే.. అధికారికంగా ఇప్పటి వరకు భవనాలు అప్పగించలేదన్నారు. సైనిక్ స్కూల్ మంజూరు చేసినా.. స్థలం కేటాయించలేదని, సైన్స్ సిటీకి  తెలంగాణ ప్రభుత్వం స్థలం ఇవ్వడం లేదని తెలిపారు. వాటికి కేంద్ర ప్రభుత్వ స్థలాలను వెతుకుతున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల తీరు వల్ల శ్రీలంక పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. 

Updated Date - 2022-05-30T01:27:18+05:30 IST