15,360 గుట్కా ప్యాకెట్లు పట్టివేత

ABN , First Publish Date - 2021-01-27T04:39:33+05:30 IST

ఉలవపాడు కృష్ణానగర్‌లోని ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచి అమ్ముతున్న 15,360 గుట్కా ప్యాకెట్లను ఎస్‌ఈబీ సీఐ బీ లత తన సిబ్బందితో దాడిచేసి పట్టుకున్నారు.

15,360 గుట్కా ప్యాకెట్లు పట్టివేత
పట్టుబడ్డ గుట్కా ప్యాకెట్లతో ఎస్‌ఈబీ సీఐ లత, సిబ్బంది

ఉలవపాడు, జనవరి 26 : ఉలవపాడు కృష్ణానగర్‌లోని ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచి అమ్ముతున్న 15,360 గుట్కా ప్యాకెట్లను ఎస్‌ఈబీ సీఐ బీ లత తన సిబ్బందితో దాడిచేసి పట్టుకున్నారు. సీఐ లత చెప్పిన వివరాల ప్రకారం.. కిరాణా షాపు యజమాని ఇంట్లో గుట్కాలు నిల్వ ఉన్నాయనే పక్కా సమాచారంతో దాడి చేశామన్నారు. నిందితుడిని పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. దాడిలో ఎస్సై ఏ పద్మజ, కే వెంకటేశ్వరరావు, సిబ్బంది రుమానా, ఏడుకొండలు, శ్రీనివాసులు, వెంకట్రావు ఉన్నారు. 

10 మంది జూదరుల అరెస్ట్‌.. రూ.41,210 స్వాధీనం

చీరాల, జనవరి 26 : వేటపాలెం ఎస్‌ఐ కమలాకర్‌కు అందిన విశ్వసనీయసమాచారం మేరకు సోమవారం రాత్రి నిర్వహించిన దాడులలో 10 మంది  జూదరులను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.41,210 స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అక్కాయిపాలెం సమీపంలోని ఖాళీ ప్రదేశంలో పేకాడుతుండగా ఎస్సై కమలాకర్‌ తన సిబ్బందితో కలసి దాడివేచి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.



Updated Date - 2021-01-27T04:39:33+05:30 IST