బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి ఇచ్చిన CM YS JAGAN
ABN , First Publish Date - 2021-07-17T19:35:26+05:30 IST
వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక పదవి కట్టబెట్టారు...
అమరావతి : వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక పదవి కట్టబెట్టారు. శనివారం నాడు ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో ఈయనకు కీలక పదవి లభించింది. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా సిద్ధార్థ్‌ను జగన్ సర్కార్ నియమించింది. కాగా.. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆర్థర్‌కు బైరెడ్డికి పడట్లేదని పలుమార్లు వార్తలు పెద్ద ఎత్తునే వచ్చాయి. పేరుకే ఎమ్మెల్యేగా ఆయన గెలిచినా పెత్తనం మాత్రం బైరెడ్డిదే అని వార్తలు కూడా గుప్పుమన్నాయి. అంతేకాదు సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ తన అనుచరులకు టికెట్లు ఇవ్వట్లేదని బైరెడ్డి, ఆర్థర్ ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నట్లు బయటికి వార్తలు పొక్కాయి. అప్పట్లో ఈ ఇద్దరి మధ్య జరిగిన గొడవను కర్నూలు జిల్లా ఇంచార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సర్ది చెప్పారని కూడా తెలియవచ్చింది.
మాట నిలబెట్టుకున్న జగన్..
పాదయాత్ర సమయంలో నందికొట్కూరు ప్రచార సభలో మాట్లాడిన జగన్.. బైరెడ్డి తన మనసులో ఉన్నాడని ఖచ్చితంగా మంచి ప్రాధాన్యత గల పోస్ట్ ఇస్తానని హామీ ఇచ్చారు. అప్పుడు జగన్ ఇచ్చిన హామీని ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా నెరవేర్చారని బైరెడ్డి అభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలు, అనుచరులు చెప్పుకుంటున్నారు. ఆయనకు పోస్ట్ ఇస్తున్నట్లు ప్రకటించగానే బైరెడ్డి ఇంటి దగ్గర.. పార్టీ ఆఫీసు దగ్గర కార్యకర్తలు, అనుచరులు స్వీట్లు పంచుకుని.. పటాసులు పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక మిగిలిన నామినేటెడ్ పోస్టుల విషయానికొస్తే..
ఏపీ టిడ్కో చైర్మన్‌గా జమ్మాన ప్రసన్నకుమార్
ఏపీ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి
ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌గా వెంకట్‌రెడ్డి
ఏపీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా రెడ్డి పద్మావతి
ఏపీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్‌గా గేదెల బంగారమ్మ
ఏపీ వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా అక్కరమాని విజయనిర్మల
ఏపీ బుడా చైర్మన్‌గా ఇంటి పార్వతి
కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా అడపా శేషు
మహిళా కో ఆపరేటివ్ ఫైనాన్స్ చైర్మన్‌గా హేమమాలిని
రాష్ట్ర మైనార్టీ విభాగం చైర్మన్‌గా జాన్ వెస్లీ
ఏపీ ఎండీసీ చైర్మన్‌గా సమీమ్ అస్లాం
బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా సుధాకర్
ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా మొండితోక కృష్ణ
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బండి పుణ్యసుశీల
ఏపీ గ్రీనింగ్ బ్యూటీ కార్పొరేషన్ చైర్మన్‌గా రామారావు
ఏపీ సామాజిక న్యాయ సలహాదారుగా జూపూడి ప్రభాకర్‌రావు
డీసీసీబీ చైర్మన్‌గా నెక్కల నాయుడుబాబు
డీసీఎంఎస్ చైర్మన్‌గా అవనపు భావన
తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ చైర్మన్‌గా నరమల్లి పద్మజ
ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా నసీర్ అహ్మద్
కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా తుమ్మల చంద్రశేఖర్
క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్‌గా పాతపాటి సర్రాజు
లేబర్ వెల్ఫేర్ బోర్డు వైస్ చైర్మన్‌గా దయ్యాల నవీన్‌బాబు
నెడ్‌క్యాప్ చైర్మన్‌గా కేకే రాజు
సాహిత్య అకాడమీ చైర్‌పర్సన్‌గా పిల్లంగొల్ల శ్రీలక్ష్మి
రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా కనుమూరి సుబ్బరాజు
పశ్చిమ డెల్టా బోర్డు చైర్మన్‌గా గంజిమాల దేవి
ఏలేశ్వరం డెవలప్‌మెంట్ బోర్డు చైర్ పర్సన్‌గా శైలజ
ఏపీఐఐసీ చైర్మన్‌గా మెట్టు గోవిందరెడ్డి
