టీపీసీసీలో జిల్లా నేతలకు కీలక పదవులు

ABN , First Publish Date - 2021-06-27T06:25:35+05:30 IST

టీపీసీసీలో జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు కీలక పదవులు లభించాయి. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ప్రచార కమిటీ చైర్మన్‌గా మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ నియమితులయ్యారు. శనివారం ఏఐసీసీ ప్రకటించిన నూతన పీసీసీలో వీరిద్దరికీ చోటు కల్పించారు.

టీపీసీసీలో జిల్లా నేతలకు కీలక పదవులు

వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మహేశ్‌కుమార్‌ గౌడ్‌
ప్రచార కమిటీ చైర్మన్‌గా మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌

నిజామాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): టీపీసీసీలో జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు కీలక పదవులు లభించాయి. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ప్రచార కమిటీ చైర్మన్‌గా మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ నియమితులయ్యారు. శనివారం ఏఐసీసీ ప్రకటించిన నూతన పీసీసీలో వీరిద్దరికీ చోటు కల్పించారు. నూతన పీసీసీ కార్యవర్గంలో జిల్లా నుంచి సముచిత స్థానం ఇచ్చారు. పార్టీని నమ్ముకుని ఉన్నవారికి అవకాశం కల్పించారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పీసీసీ నూతన కమిటీని శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌  ప్రకటి ంచారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్‌ రెడ్డిని నియమించడంతో పా టు మరో ఐదుగురిని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లుగా నియమించారు. వీరిలో జి ల్లా నుంచి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌కు, పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా మధుయాస్కీ గౌడ్‌కు అవకాశం ఇచ్చారు. ఇద్దరు నేతలు సుదీర్ఘకాలంగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్నారు. అమెరికాలో పనిచేసి జిల్లాకు వ చ్చిన మధుయాష్కీ గౌడ్‌ రెండుసార్లు నిజామాబాద్‌ ఎంపీగా పనిచేశారు. పార్లమెంట్‌లో డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంతో పా టు బిల్లు ఆమోద సమయంలోనూ మధుయాష్కీ గౌడ్‌ కీలకంగా వ్యవహరి ంచారు. రాహుల్‌ గాంధీ కోటరీలో మనిషిగా ముద్రపడ్డ అయన ఎంపీగా ఓ డిపోయినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జిల్లాకు చెంది న మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మొదటి నుంచి పార్టీని నమ్ముకొనే ఉన్నారు. కాంగ్రె స్‌ పార్టీలో వివిధ హోదాలలో పనిచేశారు. కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ సం ఘం ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా, యూత్‌ కాంగ్రెస్‌ కార్యదర్శిగా, పీసీసీ ప్ర ధాన కార్యదర్శిగా పనిచేశారు. పార్టీలో ఇతర హోదాలలో ఉన్నారు. జిల్లాకు చెందిన చాలా మంది నేతలు పార్టీలు మారినా.. అయన ఇప్పటికీ పార్టీలోనే కొనసాగుతున్నారు. జిల్లా నుంచి ఇద్దరికి పీసీసీలో కీలక పదవులు రావడం వల్ల పార్టీ మళ్లీ పుంజుకుంటుందని జిల్లా నేతలు భావిస్తున్నారు. వీరికి పద వులు రావడం పట్ల మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మానాల మోహన్‌ రెడ్డి, మాజీ అధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హుందాన్‌తో పాటు పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీకి కృతజ్ఙతలు తెలిపారు.

Updated Date - 2021-06-27T06:25:35+05:30 IST