up డిప్యూటీ సీఎం సహా 11మంది మంత్రుల ఘోర పరాజయం

ABN , First Publish Date - 2022-03-11T13:11:18+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 273 సీట్లను కైవసం చేసుకొని విజయదుందుభి మోగించినా, యూపీ డిప్యూటీ సీఎంతో సహా 11మంది రాష్ట్ర మంత్రులు ఘోర పరాజయం పాలయ్యారు....

up డిప్యూటీ సీఎం సహా 11మంది మంత్రుల ఘోర పరాజయం

లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 273 సీట్లను కైవసం చేసుకొని విజయదుందుభి మోగించినా, యూపీ డిప్యూటీ సీఎంతో సహా 11మంది రాష్ట్ర మంత్రులు ఘోర పరాజయం పాలయ్యారు. సగం కంటే అధిక స్థానాలను కైవసం చేసుకొని ఘన విజయం సాధించిన అధికార బీజేపీకి 11 మంది మంత్రులు ఓటమి పాలవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యాతోపాటు మరో 10 మంది మంత్రులు ఓటమి చవిచూశారు.గడచిన 30 ఏళ్లలో రెండవసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా బీజేపీ రికార్డు సృష్టించినా 11 మంది ఓటమి అధికార బీజేపీకి మింగుడు పడటం లేదు.


డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు తప్పని ఓటమి

సిరతు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య 7,337 ఓట్ల తేడాతో సమాజ్ వాదీ పార్టీకి చెందిన పల్లవి పటేల్ చేతిలో ఓడిపోయారు. పటేల్ సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షమైన అప్నాదళ్ (కె) ఉపాధ్యక్షుడు.

చెరకు శాఖ మంత్రికి చేదు ఫలితం

యూపీ చెరకుశాఖ మంత్రి సురేశ్ రాణా షామ్లీ జిల్లాలోని థానా భవన్ సీటులో ఆర్‌ఎల్‌డీకి చెందిన అష్రఫ్ అలీ ఖాన్ చేతిలో 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు.



ఓటమి చెందిన ఆనంద్ స్వరూప్ శుక్లా

బల్లియా జిల్లాలోని బరియా స్థానంలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన జైప్రకాష్ ఆంచల్ చేతిలో ఆనంద్ స్వరూప్ శుక్లా 12,951 ఓట్ల తేడాతో ఓడిపోయారు. శుక్లా గతసారి బల్లియా స్థానం నుంచి పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ స్థానంలో బరియా స్థానం నుంచి ఈసారి శుక్లా బరిలో నిలిచి ఓటమి చెందారు.

ఉపేంద్ర తివారీకి షాక్

యూపీ రాష్ట్ర క్రీడల మంత్రి ఉపేంద్ర తివారీ బల్లియాలోని ఫెఫ్నా స్థానంలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సంగ్రామ్ సింగ్ చేతిలో 19,354 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

రణ్వేంద్ర సింగ్ దున్నికి పరాభవం 

అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ మంత్రి రణ్వేంద్ర సింగ్ దున్నికి పరాభవం ఎదురైంది. ఫతేపూర్ జిల్లాలోని హుస్సేన్ గంజ్ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఉషా మౌర్య చేతిలో రణవేంద్ర సింగ్ దున్ని 25,181 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

 స్వల్ప ఓట్లతేడాతో లఖన్ సింగ్ ఓటమి

యూపీ మంత్రి లఖన్ సింగ్ రాజ్ పుత్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఔరయా జిల్లాలోని దిబియాపూర్‌లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ప్రదీప్ కుమార్ యాదవ్ చేతిలో లఖన్ సింగ్ రాజ్‌పుత్ 473 ఓట్ల తేడాతో ఓడిపోయారు.



ఛత్రపాల్ సింగ్ గాంగ్వార్ ఓటమి

 బరేలీ జిల్లాలోని బహేరీ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అతౌర్ రెహ్మాన్ చేతిలో ఛత్రపాల్ సింగ్ గంగ్వార్ 3,355 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఓటమి పాలైన రాజేంద్ర ప్రతాప్ సింగ్

 గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్ అలియాస్ మోతీ సింగ్ ప్రతాప్‌గఢ్‌లోని పట్టి స్థానం నుంచి పోటీ చేసి సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రామ్ సింగ్ చేతిలో 22,051 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

చంద్రికా ప్రసాద్ ఉపాధ్యాయ పరాజయం

ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోని మరో మంత్రి చంద్రికా ప్రసాద్ ఉపాధ్యాయ్ చిత్రకూట్‌లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీకి చెందిన అనిల్ కుమార్ చేతిలో 20,876 ఓట్ల తేడాతో ఓడిపోయారు.



సతీష్ చంద్ర ద్వివేదికి చుక్కెదురు

రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సతీష్ చంద్ర ద్వివేదికి చుక్కెదురైంది. సిద్ధార్థనగర్ జిల్లాలోని ఇత్వా స్థానంలో ఎస్పీ అభ్యర్థి, అసెంబ్లీ మాజీ స్పీకర్ మాతా ప్రసాద్ పాండే చేతిలో 1,662 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

మంత్రి సంగీతా బల్వంత్ కు ఎస్సీ అభ్యర్థి షాక్

మంత్రి సంగీతా బల్వంత్ కు ఎస్పీ అభ్యర్థి షాక్ ఇచ్చారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగీతా బల్వంత్‌పై ఎస్పీ అభ్యర్థి జై కిషన్‌పై గాజీపూర్‌లో 1,692 ఓట్ల తేడాతో ఓడిపోయారు.


Updated Date - 2022-03-11T13:11:18+05:30 IST