Advertisement
Advertisement
Abn logo
Advertisement

21 ఏళ్ల వయసులోనే ఈ లా విద్యార్థినికి పెళ్లి.. 3 నెలలకే పుట్టింటికి.. ఏడుస్తూ భర్త గురించి చెప్పిన అసలు నిజాలు విని..

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువతి లా చదువుతోంది. పెళ్లీడు రావడంతో ఆమెకు పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఓ అబ్బాయిని చూశారు. పెళ్లి చూపులు పూర్తైన తర్వాత కొన్ని కారణాల వల్ల అతడు వద్దూ అనుకున్నారు. ఆ తర్వాత అతడే.. ఫేస్‌బుక్‌ ద్వారా సదరు యువతికి టచ్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. కట్నం కూడా తీసుకోను అనడంతో.. యువతి తల్లిదండ్రులు కూడా వారి పెళ్లికి అడ్డుచెప్పలేదు. అంగరంగా వైభవంగా పెళ్లి చేసి, కూతురుని అత్తారింటికి సాగనంపారు. అయితే పెళ్లైన మూడు నెలలకే కూతరు పుట్టింటికి రావడంతో వాళ్లు కంగుతిన్నారు. ఏడుస్తూ ఆమె చెప్పిన నిజాలు విని విస్తుపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


కేరళకు చెందిన మోఫియా.. అలువా ప్రాంతంలోని ఎల్ఎల్‌బీ కాలేజీలో లా చదువుతోంది. ఆమెకు 21ఏళ్లు రావడంతో కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే మధ్యవర్తి ద్వారా పెళ్లి చూపుల కోసం  సుహైల్ ఇంటికి వెళ్లారు. అయితే కొన్ని కారణాల వల్ల.. ఆ సంబంధాన్ని వద్దనుకున్నారు. అయితే.. సుహైల్‌కు మాత్రం మోఫియా బాగా నచ్చడంతో.. ఫేస్‌బుక్‌ ద్వారా మళ్లీ మాటలు కలిపాడు. కొన్ని రోజులు పోయాక.. లవ్ చేస్తున్నట్టు చెప్పాడు. అతడి ప్రేమకు మోఫియా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించాడు. ఒక్కరూపాయి కూడా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటా.. అనడంతో మోఫియా తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత.. అబ్బాయి యూఏఈలో జాబ్ చేస్తాడు.. కూతురి జీవితం బాగుంటుందని మోఫియాను సుహైల్‌కి ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. 


పెళ్లై అత్తారింటికి వెళ్లిన కూతురు.. మూడు నెలల తర్వాత ఏడుస్తూ పుట్టింటికి రావడంతో మోఫియా కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. సుహైల్ యూఏఈలో జాబ్ మానేశాడని.. సినీ ఇండస్ట్రీకి వెళ్లేందుకు డబ్బులు కావాలంటూ తనను వేధిస్తున్నాడని చెప్పడంతో మోఫియా కుటుంబ సభ్యులు షాకయ్యారు. అంతేకాకుండా..తమ బిడ్డను లైగింకంగా వేధిస్తున్నట్టు తెలుసుకుని విస్తుపోయారు. ఆ తర్వాత సుహైల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మోఫియా కుటుంబ సభ్యులు.. మతపెద్దల వద్దకు పిలిపించి.. అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారి ప్రయత్నం ఫలించలేదు. మత పెద్దల దగ్గరకు రప్పించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన సుహైల్.. తాజాగా మోఫియాకు తలాక్ నోటిస్‌తోపాటు రూ.2500లను మనిఆర్డర్ చేశాడు. అయితే అందుకు మోఫియా మాత్రం దాన్ని అంగీకరించలేదు. ఆ డబ్బు, నోటీసులను తిరిగి వెనక్కి పంపింది. అయితే ఈ ఘటనలపట్ల తీవ్రంగా కలత చెందిన మోఫియా.. షాకింగ్ నిర్ణయం తీసుకుంది. బుధవారం రోజు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. సూసైడ్‌ నోట్‌లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పేర్కొనడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement