`శృంగారం కోసం బయటకు వెళ్తా.. ఈ-పాస్ ఇవ్వండి`!

ABN , First Publish Date - 2021-05-15T18:22:33+05:30 IST

ప్రస్తుతం కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు నిర్ధిష్ట సమయాల్లో కర్ఫ్యూలు విధించాయి.

`శృంగారం కోసం బయటకు వెళ్తా.. ఈ-పాస్ ఇవ్వండి`!

ప్రస్తుతం కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు నిర్ధిష్ట సమయాల్లో కర్ఫ్యూలు విధించాయి. ఆయా సమయాల్లో అనవసరంగా బయట తిరగకూడదు. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే పోలీసుల నుంచి `ఈ-పాస్` తీసుకోవాలి. తగిన కారణం చెబుతూ ఈ-పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 


ఈ-పాస్ కోసం దరఖాస్తు చేస్తూ కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చెప్పిన కారణం వైరల్‌గా మారింది. తనకు సెక్స్ కావాలని, అందుకోసం బయటకు వెళ్లాలనుకుంటాననే కారణం రాస్తూ సదరు వ్యక్తి ఈ-పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో పోలీసులు అతడిని విచారణకు పిలిపించారు.  `ఆరు గంటలకు (six) బయటకు వెళ్లాలనుకుంటున్నా.. అని రాయబోయి శృంగారం (sex) అని పొరపాటును రాశాన`ని అతను వివరించాడు. అతను క్షమాపణ కోరడంతో పోలీసులు వదిలేశారు. 

Updated Date - 2021-05-15T18:22:33+05:30 IST