కేరళలో నోరో వైరస్... అప్రమత్తంగా ఉండాలంటున్న ప్రభుత్వం...

ABN , First Publish Date - 2021-11-13T01:54:14+05:30 IST

కేరళలో నోరో వైరస్ కేసులు నిర్ధరణ కావడంతో రాష్ట్ర

కేరళలో నోరో వైరస్... అప్రమత్తంగా ఉండాలంటున్న ప్రభుత్వం...

తిరువనంతపురం : కేరళలో నోరో వైరస్ కేసులు నిర్ధరణ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇది అంటు వ్యాధి అని, ఈ వైరస్ వల్ల వాంతులు, అతిసార వస్తాయని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరింది. వయనాద్ జిల్లాలోని ఓ వెటరినరీ కాలేజ్‌లో చదువుతున్న 13 మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకినట్లు రెండు వారాల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 


ప్రస్తుతం నోరో వైరస్ కేసులు కొత్తగా కనిపించలేదని కేరళ ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. వెటరినరీ సైన్స్ కాలేజ్ విద్యార్థుల డేటా బ్యాంకును సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా అవగాహన తరగతులను నిర్వహిస్తామన్నారు. 


ఈ కళాశాల ప్రతినిధులు మాట్లాడుతూ, నోరో వైరస్ ఇన్ఫెక్షన్ తమ క్యాంపస్ వెలుపల ఉన్న హాస్టళ్ళలో ఉంటున్న విద్యార్థుల్లో కనిపించిందన్నారు. 


Updated Date - 2021-11-13T01:54:14+05:30 IST